Assam Zooలో రాయల్ బెంగాల్ పులికి రెండు కూనలు

ABN , First Publish Date - 2022-02-08T13:20:28+05:30 IST

గౌహతిలోని అస్సాం స్టేట్ జూ-కమ్-బొటానికల్ గార్డెన్‌లో రాయల్ బెంగాల్ పులి రెండు కూనలకు జన్మనిచ్చింది....

Assam Zooలో రాయల్ బెంగాల్ పులికి రెండు కూనలు

గౌహతి: గౌహతిలోని అస్సాం స్టేట్ జూ-కమ్-బొటానికల్ గార్డెన్‌లో రాయల్ బెంగాల్ పులి రెండు కూనలకు జన్మనిచ్చింది. కాజీ అనే రాయల్ బెంగాల్ పులి రెండు పిల్లలకు జన్మనిచ్చింది. ఈ కూనలతో జూలో బెంగాల్ పులుల సంఖ్య 9కి చేరింది.కాజీ ఇంతకు ముందు 2020 ఆగస్ట్ లో సుల్తాన్, సురేష్ అనే రెండు కూనలకు జన్మనిచ్చింది. పులి పిల్లలు ఆరోగ్యంగా ఉన్నాయని జూకీపర్లు పంజరం వెలుపల హీటర్లు పెట్టి చలి నుంచి రక్షణ కల్పించారని అసోం రాష్ట్ర జంతుప్రదర్శనశాల డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ డాక్టర్ అశ్విని కుమార్ చెప్పారు.తల్లి పులికి పౌష్టికాహారంతోపాటు 7 కిలోల మాంసాన్ని ఇస్తున్నామని ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అమిత్ సహాయ్ చెప్పారు.


కొత్తగా పుట్టిన పులి పిల్లలకు పేర్లు పెట్టాల్సిందిగా అటవీశాఖ అధికారులు పర్యావరణ, అటవీ శాఖ మంత్రి పరిమళ సుక్లాబాయిద్యను అభ్యర్థించారు. మంత్రి శుక్లబైద్య గతంలో పలు జంతువులకు పేరు పెట్టారు. మంత్రి జంతువులకు పెట్టిన పేర్లు జనాదరణ పొందాయి.


Updated Date - 2022-02-08T13:20:28+05:30 IST