ఇద్దరు ఎర్రచందనం స్మగ్లర్ల అరెస్టు

ABN , First Publish Date - 2021-10-26T04:51:31+05:30 IST

ప్రొద్దుటూరు టౌన్‌ కొత్తపల్లె క్రాస్‌ రోడ్డు వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా అక్రమంగా తరలిస్తున్న దుంగలతో పాటు ఒక స్మగ్లర్‌ను అరెస్టు చేసినట్లు ఎస్పీ అన్బురాజన్‌ తెలిపారు.

ఇద్దరు ఎర్రచందనం స్మగ్లర్ల అరెస్టు
ఎర్రచందనం దుంగలను పరిశీలిస్తున్న ఎస్పీ

పరారీలో ఐదుగురు : నిందితుల వివరాలు వెల్లడించిన ఎస్పీ

కడప(క్రైం), అక్టోబరు 25 : ప్రొద్దుటూరు టౌన్‌ కొత్తపల్లె క్రాస్‌ రోడ్డు వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా అక్రమంగా తరలిస్తున్న దుంగలతో పాటు ఒక స్మగ్లర్‌ను అరెస్టు చేసినట్లు ఎస్పీ అన్బురాజన్‌ తెలిపారు. జిల్లా పోలీస్‌ కార్యాలయంలో ఎస్పీ అన్బురాజన్‌, ఓఎ్‌సడీ దేవప్రసాద్‌, ప్రొద్దుటూరు డీఎస్పీ, ఎస్‌ఐ అరుణ్‌రెడ్డిలతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించి నిందితుల వివరాలను వెల్లడించారు. చాపాడు మండలం ఖాదర్‌పల్లి గ్రామానికి చెందిన జింకానం రజవళి, కదనూరు హబీబుల్లా ఎర్రచందనం దుంగల అక్రమ రవాణాకు పాల్పడుతుండేవారు. ఎస్‌ఐ అరున్‌రెడ్డి ఆధ్వర్యంలో వాహన తనిఖీలు చేస్తుండగా టయోటా కారు తనిఖీ చేయడంతో ఆ వాహనంలో ఉన్న 5 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకొని జింకానం రజవళిని అరెస్టు చేశారన్నారు. అతడు ఇచ్చిన సమాచారం మేరకు రెడ్‌శ్యాండల్‌ టాస్క్‌ఫోర్స్‌ సీఐ నాగార్జున ఆధ్వర్యంలో అనంతపురంలోని గోడౌన్‌పై దాడులు నిర్వహించగా షేక్‌ సింపతిలాల్‌బాష, సింపతి జాకీర్‌, సింపతి అలి, సింపతి ఫకృద్దీన్‌, నాజీర్‌ అలియాస్‌ నాజిల్‌ పరారయ్యారని, కారులో 16 దుంగలతో పారిపోతున్న హబీబుల్లాను అరెస్టు చేశామన్నారు. వారి వద్ద నుంచి 21 దుంగలతో పాటు రెండు కార్లు, 5 గొడ్డళ్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. జింకానం రజవళిపై జిల్లాలో 24 కేసులు, కందలూరు హబీబుల్లాపై 10 ఎర్రచందనం కేసులు, మరో నాలుగు గ్యాంబ్లింగ్‌ కేసులు ఉన్నట్లు తెలిపారు. పరారీలో ఉన్న వారి కోసం గాలింపు చర్యలు చేపట్టామని త్వరలో వారిని అరెస్టు చేస్తామని తెలిపారు. 


రామాపురంలో నలుగురు కూలీల అరెస్ట్‌


రామాపురం, అక్టోబరు 25: రాయచోటి ఫారెస్ట్‌ రేంజ్‌ పరిధిలోని గడికోట బీట్‌ మెగాల కటవల వద్ద 38 ఎర్రచందనం దుంగలతో పాటు నలుగురు కూలీలను అరెస్టు చేసినట్లు డీఎఫ్‌వో రవీంద్రదామ, రాయచోటి రేంజ్‌ ఆఫీసర్‌ మురళీకృష్ణ తెలిపారు. స్థానిక రాయచోటి రేంజ్‌ కార్యాలయంలో బుధవారం విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడుతూ రేంజర్‌ మురళీకృష్ణ ఆధ్వర్యంలో వారికి అందిన రహస్య సమాచారం మేరకు గడికోట బీట్‌లో కూంబింగ్‌ నిర్వహించగా మెగాల రస్తా కటవల్లో తమిళనాడుకు చెందిన సంతో్‌షకుమార్‌, మణి, రాజెందిరన్‌, కథిరివెల్‌లను అరెస్టు చేయడంతో పాటు 38 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితులను కోర్టులో హాజరు పరచగా జడ్జి రిమాండ్‌ విధించినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఫారెస్ట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌ ఎన్‌వీ సురే్‌షబాబు, బీట్‌ ఆఫీసర్లు భరణికుమార్‌, కృష్ణప్రసాద్‌, రఘుపతిరాజు, బేస్‌ క్యాంప్‌ వాచర్‌లు పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-26T04:51:31+05:30 IST