Abn logo
Apr 7 2020 @ 17:35PM

రీమేక్ కోసం చేతులు క‌లుపుతున్న రెండు నిర్మాణ సంస్థ‌లు

మ‌ల‌యాళ చిత్రం ‘అయ్య‌ప్ప‌నుమ్ కోశియ‌మ్‌’ను తెలుగులో రీమేక్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తాజా సమాాచారం మేరకు ఈ చిత్రానికి సంబంధించిన తెలుగు రీమేక్ హ‌క్కుల‌ను సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సంస్థ ద‌క్కించుకుంది. ఇందులో బాల‌కృష్ణ‌, రానా ద‌గ్గుబాటి న‌టిస్తార‌ని కూడా టాక్ వ‌చ్చింది. ఈ నేప‌థ్యంలో సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ కూడా నిర్మాణంలో భాగం కానున్న‌ట్లు తెలిసింది. మ‌రి బాల‌య్య ఈ రీమేక్‌లో న‌టిస్తున్నారా? అనే దానిపై  ఇంకా క్లారిటీ రాలేద‌ని స‌మాచారం. క‌రోనా ప్ర‌భావం త‌గ్గిన త‌ర్వాత ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డే అవకాశం ఉంద‌ట‌. 

Advertisement
Advertisement
Advertisement