ప్రతిష్టాత్మక పోలీస్‌ అవార్డులకు రవికుమార్‌ ఎంపిక

ABN , First Publish Date - 2022-08-15T04:58:08+05:30 IST

ఏలూరు జిల్లా పోలీస్‌ స్పెషల్‌ బ్రాంచ్‌లో విభాగంలో ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న వి. రవికుమార్‌ ప్రతిష్టాత్మకమైన రెండు పోలీస్‌ అవార్డులకు ఎంపికయ్యారు.

ప్రతిష్టాత్మక పోలీస్‌ అవార్డులకు రవికుమార్‌ ఎంపిక
రవికుమార్‌

ఏలూరు రూరల్‌, ఆగస్టు 14: ఏలూరు జిల్లా పోలీస్‌ స్పెషల్‌ బ్రాంచ్‌లో విభాగంలో ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న వి. రవికుమార్‌ ప్రతిష్టాత్మకమైన రెండు పోలీస్‌ అవార్డులకు ఎంపికయ్యారు. వీటిని ఆగస్టు 15న పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌లో జరుగనున్న స్వాతంత్య్ర  వేడుకల్లో స్వీకరించనున్నారు. 2020 సంవత్సరానికి గాను డిస్క్‌ మెడల్‌, 2021 సంవత్సరానికి గాను ఉత్తమ సేవా పతకాన్ని ఆయన పొందారు. డీజీపీ డిస్క్‌ మెడల్‌ పొందేందుకు గాను గత పదేళ్లలో అందించిన ఉత్తమ సేవలు, విధి నిర్వహణలో ఎటువంటి రిమార్కులు లేని అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. అలాగే ఉత్తమ సేవా పతకాన్ని పొందేందుకు గాను గత ఇరవై ఏళ్లలో అందించిన ఉత్తమ సేవలు, విధి నిర్వహణలో ఎటువంటి రిమార్కులు లేని అంశాలను పరిగణలోకి తీసుకుంటారు.


Updated Date - 2022-08-15T04:58:08+05:30 IST