కారూరులో ఇద్దరికి గాయాలు

ABN , First Publish Date - 2021-07-25T04:07:50+05:30 IST

మండలంలోని కారూరు గ్రామంలో రెండు కుటుంబాల మధ్య జరిగిన ఘర్షణలో ఇద్దరికి గాయాలు అయ్యాయి.

కారూరులో  ఇద్దరికి గాయాలు

తడ, జూలై 24 : మండలంలోని కారూరు గ్రామంలో రెండు కుటుంబాల మధ్య జరిగిన ఘర్షణలో ఇద్దరికి గాయాలు అయ్యాయి. ఎస్‌ఐ శ్రీనివాసులురెడ్డి వివరాల మేరకు కారూరు గ్రామంలో  ఆంబాకం శబరీరాజన్‌కు, అతని ఇంటికి సమీపంలో ఉండే పరమశివం మధ్య కొంత కాలంగా చిన్నపాటి గొడవలు ఉన్నాయి. శనివారం  వారిద్దరు రోడ్డుపై ఒకరికి ఒకరు తారాసపడటంతో మరోసారి గొడవ రేగింది. వారు ఇళ్లకు వెళ్లాక ఆ గొడవ రెండు కుటుంబాల మధ్య ఘర్షణకు దారితీసింది. గాయపడిన వారిద్దరు ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు  చేసుకున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-07-25T04:07:50+05:30 IST