కానిస్టేబుల్ బర్త్‌డే వేడుకలు.. ఇద్దరికి కరోనా..

ABN , First Publish Date - 2020-09-17T16:52:08+05:30 IST

హైదరాబాద్: రాచకొండ కమిషనరేట్ పరిధిలోని కీసరలో ఓ కానిస్టేబుల్ జన్మదిన వేడుకలు జరిగాయి.

కానిస్టేబుల్ బర్త్‌డే వేడుకలు.. ఇద్దరికి కరోనా..

హైదరాబాద్: ఒకవైపు రాష్ట్రంలో కరోనా విజృంభిస్తోంది. ఇలాంటి సమయంలో వేడుకలకు దూరంగా ఉండాలని అధికార యంత్రాంగమంతా చెబుతోంది. ఇలాంటి సమయంలో ప్రజలను అప్రమత్తం చేయాల్సిన పోలీస్ శాఖలోని కొందరు వ్యక్తులు నిబంధనలను అతిక్రమిస్తున్నారు. ఇలాంటి వారి కారణంగా మొత్తం వ్యవస్థకే చెడ్డ పేరు వస్తోంది.


రాచకొండ కమిషనరేట్ పరిధిలోని కీసరలో ఓ కానిస్టేబుల్ జన్మదిన వేడుకలు జరిగాయి. ఈ వేడుకలకు హాజరైన ఇద్దరికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించి జన్మదిన వేడుకలు జరుపుకున్న శివకుమార్ అనే కానిస్టేబుల్‌ను సీపీ షనూర్ బాబు సస్పెండ్ చేశారు. నవీన్ అనే కానిస్టేబుల్‌కు ఛార్జ్ మెమో ఇచ్చారు. ఇన్‌స్పెక్టర్‌కు సీపీ షో కాజ్ నోటీస్ జారీ చేశారు.

Updated Date - 2020-09-17T16:52:08+05:30 IST