భారత్‌పై గూఢచర్యం.. పాక్‌ అధికారుల పట్టివేత

ABN , First Publish Date - 2020-06-01T07:38:46+05:30 IST

న్యూఢిల్లీలోని పాకిస్థాన్‌ హైకమిషన్‌ కార్యాలయంలో పనిచేసే ఇద్దరు అధికారులు భారత్‌పై గూఢచర్యానికి పాల్పడుతుండగా.. నిఘావర్గాలు ఆదివారం రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నాయి. ఆ ఇద్దరిని ఆబిద్‌ హుస్సేన్‌, తాహిర్‌ ఖాన్‌గా గుర్తించారు. వారిద్దరూ పాక్‌ హైకమిషన్‌లో వీసా అసిస్టెంట్లుగా...

భారత్‌పై గూఢచర్యం.. పాక్‌ అధికారుల పట్టివేత

న్యూఢిల్లీ, మే 31: న్యూఢిల్లీలోని పాకిస్థాన్‌ హైకమిషన్‌ కార్యాలయంలో పనిచేసే ఇద్దరు అధికారులు భారత్‌పై గూఢచర్యానికి పాల్పడుతుండగా.. నిఘావర్గాలు ఆదివారం రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నాయి. ఆ ఇద్దరిని ఆబిద్‌ హుస్సేన్‌, తాహిర్‌ ఖాన్‌గా గుర్తించారు. వారిద్దరూ పాక్‌ హైకమిషన్‌లో వీసా అసిస్టెంట్లుగా పనిచేస్తున్నారు. ఈ ఘటనతో వారిద్దరినీ పర్సోనా-నాన్‌ గ్రాటా (ఆహ్వానం లేని వ్యక్తులు)గా ప్రకటించారు. అంటే.. వారికి ఇకపై భారత్‌లోకి వచ్చేందుకు అనుమతి ఉండదు. ఆ ఇద్దరినీ సోమవారం పాక్‌కు తిప్పిపంపే అవకాశాలున్నాయి. 


Updated Date - 2020-06-01T07:38:46+05:30 IST