మరో ఇద్దరిపై అనుమానం

ABN , First Publish Date - 2020-03-28T10:26:09+05:30 IST

ఏలూరు ప్రభుత్వాసు పత్రిలోని ఐసొలేషన్‌ వార్డుకు మరో రెండు అనుమానిత కేసులు వచ్చాయి. దేవరపల్లికి చెందిన 29 ఏళ్ల ఓ వ్యక్తి ఇటీవల గల్ఫ్‌ నుంచి...

మరో ఇద్దరిపై అనుమానం

ఏలూరు ఎడ్యుకేషన్‌/ఏలూరు క్రైం, మార్చి 27 : ఏలూరు ప్రభుత్వాసు పత్రిలోని ఐసొలేషన్‌ వార్డుకు మరో రెండు అనుమానిత కేసులు వచ్చాయి. దేవరపల్లికి చెందిన 29 ఏళ్ల ఓ వ్యక్తి ఇటీవల గల్ఫ్‌ నుంచి వచ్చాడు. అతనికి దగ్గు, జలుబు, జ్వరం, గొంతు నొప్పి ఉండడంతో గురువారం అర్ధరాత్రి తరువాత ఏలూరు తీసుకువచ్చారు. వెంటనే రక్త నమూనాలు సేకరించి వైద్య పరీక్షల నిమిత్తం విజయవాడకు పంపించారు. ఏలూరు పత్తేబాదకు చెందిన 64 ఏళ్ల మరో వ్యక్తికి దగ్గు, జలుబు, జ్వరం, గొంతు నొప్పి ఉండడంతో శుక్రవారం తీసుకువచ్చారు. వార్డులో ఉంచి వైద్య సేవలందిస్తు న్నారు. రెండు రోజుల తరువాత ఆరోగ్య పరిస్థితిని బట్టి అవసరమైతే అతని నుంచి నమూనాలను సేకరించి వైద్య పరీక్షలకు పంపించనున్నారు. విదేశాల నుంచి జిల్లాకు వచ్చి హోం ఐసొలేషన్‌లోవున్న 4,146 మందికి ప్రయాణికుల కదలికలపై క్షేత్రస్థాయి నిఘాను మరింత పెంచాలని వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయించింది. మొత్తం 28 రోజుల హోం ఐసొలేషన్‌ వ్యవధిలో నిబంధనల ను ఉల్లంఘించి పలువురు యథేచ్ఛగా బయట తిరగడంపై శుక్రవారం ఆంధ్రజ్యోతిలో కథనం ప్రచురితమైంది. దీనిపై స్పందించిన జిల్లా అధికారులు సంబంధిత వ్యక్తుల కదలికలపై క్షేత్రస్థాయిలో నిఘాను పటిష్టవంతం చేయాలని నిర్ణయిం చారు. 


ఈ క్రమంలో హోం ఐసొలేషన్‌లు ఉన్న వారందరినీ జియో ట్యాగింగ్‌ చేసే ప్రక్రియను యుద్ధ ప్రాతిపదికన చేపట్టి ముగించారు. పాస్‌పోర్టులో వున్న వివరాల ఆధారంగా హోం ఐసొలేషన్‌లో వున్న వ్యక్తులు నివసించే గ్రామం, ఆధార్‌ సంఖ్య, నివాస గృహాలను ట్యాగింగ్‌ చేయడం ద్వారా వారి కదలికలపై నిరంతర నిఘా ఉంచుతారు. ప్రతీ పది మంది విదేశీ ప్రయాణికుల కదలికలను గమనించేందుకు సంబంధిత తహసీల్దార్‌, ఎంపీడీవో, మండల స్థాయి అధికారులకు బాధ్యతలు అప్పగించారు. వీరంతా స్థానికంగా విదేశీ ప్రయాణికులు, నిర్దేశిత నివాస గృహాల్లో హోం ఐసొలేషన్‌లో ఉన్నదీ, లేనిదీ ఎప్పటికిప్పుడు తెలుసుకుని ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వాల్సి ఉంది. 


Updated Date - 2020-03-28T10:26:09+05:30 IST