Abn logo
Sep 21 2020 @ 09:41AM

క్వారీలో పేలుడు..ఇద్దరు వలస కార్మికుల మృతి

Kaakateeya

ఎర్నాకుళం (కేరళ): ఓ క్వారీలో సోమవారం తెల్లవారుజామున జరిగిన పేలుడులో ఇద్దరు వలస కార్మికులు మరణించిన విషాద ఘటన కేరళ రాష్ట్రంలోని ఎర్నాకుళం జిల్లా మలయత్తూరు క్వారీలో జరిగింది. మలయత్తూరు క్వారీలో రాళ్లు పగలగొట్టేందుకు వీలుగా పేలుళ్లు జరిపేందుకు ఓ భవనంలో మందుగుండు సామాగ్రిని నిల్వ చేశారు. మందుగుండు సామాగ్రి సోమవారం తెల్లవారుజామున మూడున్నర గంటలకు పేలడంతో ఇద్దరు వలసకార్మికులు మరణించారు. 

తమిళనాడు రాష్ట్రానికి చెందిన వలసకార్మికుడు పెరియణ్ణన్, కర్ణాటకకు చెందిన మరో కార్మికుడు డీ నాగలు మరణించారు. ఈ పేలుడుకు కారణాలపై ఎర్నాకుళం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వలసకార్మికుల మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు.

Advertisement
Advertisement