చాంద్రాయణగుట్టలో విధుల్లో ఉన్న కానిస్టేబుల్‌పై దాడి

ABN , First Publish Date - 2020-04-05T01:40:57+05:30 IST

నగరంలోని చంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న ప్రవీణ్ అనే ..

చాంద్రాయణగుట్టలో విధుల్లో ఉన్న కానిస్టేబుల్‌పై దాడి

హైదరాబాద్ : నగరంలోని చంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న ప్రవీణ్ అనే కానిస్టేబుల్‌పై ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు. విధుల్లో ఉన్న ఆయనపై కర్రలతో వచ్చిన ఇద్దరు వ్యక్తులు దాడికి దిగారు. ఈ ఘటనలో ప్రవీణ్‌కు గాయాలయ్యాయి.


సమాచారం అందుకున్న పోలీసులు ఆ కానిస్టేబుల్‌ను హుటాహుటిన డి‌ఆర్డీఏ ఆపోలో ఆసుపత్రికి తరలించారు. మరోవైపు ఫలక్‌నుమా ఏసీపీ మజీద్ సంఘటన స్థలానికి చేరుకున్నారు. దాడి చేసిన వ్యక్తులు ఎవరు..? ఎందుకు దాడిచేశారు..? విధులకు ఎందుకు ఆటంకం కలిగించి ఇలా దాడి చేశారు..? అని ఏసీపీ ఆరా తీస్తున్నారు. కాగా ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Updated Date - 2020-04-05T01:40:57+05:30 IST