encounter: ఇద్దరు లష్కరే తోయిబా ఉగ్రవాదుల హతం

ABN , First Publish Date - 2021-07-23T13:58:56+05:30 IST

జమ్మూకశ్మీరులోని బారాముల్లా జిల్లా సోపోరి సమీపంలోని వార్ పొర గ్రామంలో శుక్రవారం ఉదయం జరిగిన ఎన్‌కౌంటరులో...

encounter: ఇద్దరు లష్కరే తోయిబా ఉగ్రవాదుల హతం

బారాముల్లా (జమ్మూకశ్మీర్): జమ్మూకశ్మీరులోని బారాముల్లా జిల్లా సోపోరి  సమీపంలోని వార్ పొర గ్రామంలో శుక్రవారం ఉదయం జరిగిన ఎన్‌కౌంటరులో లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థకు చెందిన ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు.సోపోరిలోని వార్ పొర ప్రాంతంలోని ఓ ఇంట్లో లష్కరే తోయిబా ఉగ్రవాదులున్నారనే సమాచారం మేర జమ్మూకశ్మీర్ పోలీసులు జవాన్లతో కలిసి గాలింపు చేపట్టారు. గురువారం రాత్రి నుంచి ఉగ్రవాదుల కోసం గాలిస్తుండగా జవాన్లపైకి ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో జవాన్లు అప్రమత్తం ఎదురుకాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరు లష్కరే తోయిబా ఉగ్రవాదులు హతమయ్యారు.మృతుల్లో ఫయాజ్ అనే ఉగ్రవాదిని గుర్తించామని, ఇతను పలు ఉగ్రదాడులు, హత్య కేసుల్లో నిందితుడని కశ్మీర్ పోలీసు ఐజీ విజయకుమార్ చెప్పారు. ఉత్తర కశ్మీరులో హింసకు ఫయాజ్ కారణమని ఐజీ చెప్పారు. ఉగ్రవాదుల కోసం భద్రతా బలగాల గాలింపు ఇంకా కొనసాగుతూనే ఉంది. 


Updated Date - 2021-07-23T13:58:56+05:30 IST