రెండు కాళ్లతో నడుస్తూ...

ABN , First Publish Date - 2021-11-10T05:30:00+05:30 IST

ఈ చిత్రం చూడండి. కుక్క రెండు కాళ్లపై మనిషిలా దర్జాగా నడుస్తోంది కదూ! నిజమే...

రెండు కాళ్లతో నడుస్తూ...

ఈ చిత్రం చూడండి. కుక్క రెండు కాళ్లపై మనిషిలా దర్జాగా నడుస్తోంది కదూ! నిజమే, కానీ ఒక ప్రమాదంలో ఆ కుక్క తన రెండు కాళ్లు పోగోట్టుకుంది. ఆ తరువాతే ఇలా నడవడం అలవాటు చేసుకుంది. 


 ఈ కుక్క పేరు డెక్స్‌టర్‌. ప్రస్తుతం దీని వయస్సు ఆరేళ్లు. ఏడాది వయస్సు ఉన్న సమయంలో ఒకరోజు రోడ్డు దాటే సమయంలో కారు కింద పడింది. రెండు కాళ్లు నుజ్జునుజ్జయ్యాయి. అయితే సమయానికి ఆసుపత్రికి చేర్చడం వల్ల ప్రాణాపాయం తప్పింది. కానీ వైద్యులు రెండు కాళ్లు తీసేశారు. ఆ తరువాత యజమాని సహాయంతో రెండు కాళ్లపై నడవడం అలవాటు చేసుకుంది.

 రెండు కాళ్లు తీసేసిన తరువాత కుక్క యజమాని అయిన కెంటీ కస్టమ్‌ వీల్స్‌ తీసుకొచ్చాడు. దానితో నెమ్మదిగా నడవడం అలవాటు చేసుకుంది. ఇప్పుడు ఎలాంటి సపోర్టు అవసరం లేకుండా రెండు కాళ్లపై నడుచుకుంటూ వెళుతుంది. ఇటీవలే ఆ వీడియోలను యజమాని సోషల్‌మీడియాలో పెట్టడంతో లక్షల వ్యూస్‌ వచ్చాయి.

Updated Date - 2021-11-10T05:30:00+05:30 IST