రెండు దారులు

ABN , First Publish Date - 2020-10-19T06:14:10+05:30 IST

జీవిత గమనం ఎప్పుడూ ఒక్క దారి కాదు అది రెండు దారులు...

రెండు దారులు

జీవిత గమనం

ఎప్పుడూ ఒక్క దారి కాదు 

అది రెండు దారులు 


మొదటి దారి సులువయింది 

ఎలాంటి మలుపులూ వుండవు 


ఆ దారి ప్రపంచానికి భిన్నమయిందేమీ కాదు 


ఈ దారిలో నియమాల అనేక ప్రాంగణాలుంటాయి 

ఎన్నో సంబంధాల

బంధనాలుంటాయి 


కానీ 

ఈ దారిలో నడిచేవారికి 

సంతోషాలు పేరుకే దొరుకుతాయి 


వాళ్ళు ముక్కలు ముక్కలై 

అనేక బంధాల నడుమ విభజింపబడుతారు 

వారికంటూ ఏమీ మిగలదు 

అంతా పేరు లేని ఓ గందరగోళం 

ఇందులో మిగిలేదేమిటి 

వారి కలలూ, స్వయంభావనా  

శ్వాసాగ్నిలో కాలిపోతాయి 


ఈ దారిని ఎంచుకున్న వాళ్ళు 

లోకాన్ని సంతోషపరచడానికి 

తమని తామే కోల్పోతారు 

పైన బతికి ఉన్నట్టే కనిపించినా  

లోన మరణిస్తారు 


ఇక రెండో దారి కష్టతరమయింది 

ఇక్కడ నీతో ఎవరూ వుండరు 

సహాయానికి చేయందించరు 


ఈ దారిలో మండే ఎండలుంటాయి 

నీడలుండవు 


ఈ దారిలో

దానంగానైనా ఇచ్చే ఓదార్పులుండవు 

అలాంటి ఓ ఊరూ ఉండదు  


తమ వైపు తాము పయనించేవారూ 

తమని తాము కనుగొనే వారి కోసమే 

ఈ దారి 

నువ్వు ఈ దారినే ఎంచుకో 


నాకు తెలుసు 

ఈ దారి అంత సులభమయింది కాదు 


కానీ 

ఇప్పటిదాకా నిన్ను నువ్వు తెలుసుకోలేదనే 

బాధ నన్ను కలిచివేస్తున్నది

(కూతురు జోయా కోసం)

జావేద్‌ అఖ్తర్‌

ఆంగ్లానువాదం: డేవిడ్‌ మాత్యు

తెలుగు: వారాల ఆనంద్‌ 

Updated Date - 2020-10-19T06:14:10+05:30 IST