జెరూసలేం: ఇజ్రాయెల్ మిలటరీ హెలికాప్టర్ మధ్యధరా సముద్రంలో కూలిపోయిన దుర్ఘటనలో ఇద్దరు మిలటరీ పైలట్లు మరణించారు.ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అటాలెఫ్ మిలటరీ హెలికాప్టర్ ఇజ్రాయెల్ దేశంలోని హైఫా తీరంలోని మధ్యధరా సముద్రంలో కూలిపోయిందని సైన్యం తెలిపింది. హెలికాప్టరులో ఉన్న మరో వైమానిక ఉద్యోగి తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాద స్థలంలో ఇజ్రాయెల్ యొక్క స్పెషల్ ఫోర్సెస్ అండర్ వాటర్ మిషన్స్ యూనిట్‌తో సహా రెస్క్యూ టీమ్‌లను మోహరించారు.అయినా ఇద్దరు పైలట్లను రక్షించలేకపోయారు. హెలికాప్టర్ కుప్పకూలిన ప్రమాద ఘటనతో దేశంలో వైమానిక శిక్షణను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఇజ్రాయెల్ వైమానిక దళ కమాండర్ అమికమ్ నార్కిన్ ప్రకటించారు. ఈ ప్రమాద ఘటనపై దర్యాప్తునకు ఆదేశించినట్లు సైన్యం తెలిపింది.
ఇవి కూడా చదవండి