Advertisement
Advertisement
Abn logo
Advertisement

పసుపు బాయిలర్ పేలుడు ఘటనలో ఇద్దరి మృతి

 గుంటూరు‌: పసుపు బాయిలర్ పేలుడు ఘటనలో చికిత్స పొందుతున్న ఇద్దరు మృతి చెందారు. కొల్లూరు మండలం ఈపూరులో పసుపు బాయిలర్ పేలి ఐదుగురు రైతులు గాయపడ్డారు. గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న రైతులు భూషణ్, రాజేష్ మృతి చెందారు. మరో ముగ్గురికి చికిత్స కొనసాగుతోంది. 


కొల్లూరు మండలం ఈపూరు గ్రామంలో గత నెల 25న గురువారం పసుపు వండే బాయిలర్‌ పేలడంతో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డ విషయం తెలిసిందే. ఈపూరు రవివర్మ, ఈపూరు కిషోర్‌, ఈపూరు నాగభూషణం, నిక్కు చంద్రశేఖర్‌, మూల్పూరు రాజేష్‌లు తీవ్రంగా గాయపడటంతో వారిని మంగళగిరిలోని ఎన్నారైకి ఆసుపత్రికి తరలిచంచారు. మెరుగైన చికిత్స కోసం  అక్కడి నుంచి గుంటూరులోని ప్రభుత్వ సమగ్ర వైద్యశాలకు తరలించారు. ఐదుగురిలో ముగ్గురికి 90 శాతం, ఇద్దరు 70 శాతం గాయపడినట్లు వైద్యులు తెలిపారు. వారిలో ఇద్దరు ఈ రోజు మృతి చెందారు.

Advertisement

ఆంధ్రప్రదేశ్ మరిన్ని...

Advertisement