సింగపూర్‌లో జైలుపాలైన ఇద్దరు భారతీయులు.. వాళ్లు చేసిన నేరం ఏంటంటే..

ABN , First Publish Date - 2021-07-29T00:46:29+05:30 IST

ఇండియాకు చెందిన ఇద్దరు వ్యక్తులు కటకటాలపాలైన ఘటన సింగపూర్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. భారత్‌కు చెందిన బెయిల్వాల్ సునీల్ దత్, సూత్రధర్ బిజోయ్ అనే ఇద్దరు కొద్ది రోజుల క్రితం సింగపూ

సింగపూర్‌లో జైలుపాలైన ఇద్దరు భారతీయులు.. వాళ్లు చేసిన నేరం ఏంటంటే..

సింగపూర్: ఇండియాకు చెందిన ఇద్దరు వ్యక్తులు కటకటాలపాలైన ఘటన సింగపూర్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. భారత్‌కు చెందిన బెయిల్వాల్ సునీల్ దత్, సూత్రధర్ బిజోయ్ అనే ఇద్దరు కొద్ది రోజుల క్రితం సింగపూర్ వెళ్లారు. చదువుకున్న సర్టిఫికెట్లతో అక్కడ వర్క్ పాస్‌లకు దరఖాస్తు చేశారు. ఈ అప్లికెషన్‌లను సింగపూర్ మినిస్టరీ ఆఫ్ మ్యాన్‌పవర్ అధికారుల పరిశీలించారు. ఈ క్రమంలో సునీల్ దత్, సూత్రధర్ బిజోయ్ మోసానికి పాల్పడ్డట్లు తేలింది. నకిలీ స్టడీ సర్టిఫికేట్లతో ఈ ఇరువురూ వర్క్ పాస్‌ల కోసం దరఖాస్తు చేసినట్టు అక్కడి అధికారులు గుర్తించారు.



దీంతో పోలీసులకు సమాచారం అందించారు. ఈ క్రమంలో వారిని అరెస్ట్ చేసిన పోలీసులు, కోర్టులో హాజరుపర్చారు. ఈ కేసుపై విచారణ జరిపిన కోర్టు.. సునీత్ దత్‌కు వారం రోజులు, సూత్రధర్ బిజోయ్ అనే వ్యక్తికి నాలుగు వారాల జైలు శిక్షను విధించింది. ఇదిలా ఉంటే.. మిసిన్టరీ ఆఫ్ మ్యాన్‌పర్ అధికారులు స్పందిస్తూ.. భవిష్యత్తులో సింగపూర్‌లో ఉద్యోగం చేయడానికి వీలు లేకుండా ఇద్దరిపై శాశ్వితంగా నిషేధం విధించినట్టు వెల్లడించారు. కాగా.. భండారీ రాఘవేంద్ర అనే వ్యక్తి కూడా నకిలీ స్టడీ సర్టిఫికెట్లతో వర్క్ పాస్‌ను పొందాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆగస్ట్ 5న ఈ కేసుపై కోర్టులో విచారణ జరగనుంది.  


Updated Date - 2021-07-29T00:46:29+05:30 IST