ఒమన్‌లో ఇద్దరు భారతీయ ఇంజినీర్లు మృతి

ABN , First Publish Date - 2022-07-04T15:35:52+05:30 IST

ఒమన్‌లో దారుణం చోటు చేసుకుంది. సుమారు 6 రోజుల క్రితం నుంచి ఆచూకీ లేకుండా పోయిన ఇద్దరు ఇంజినీర్ల మృతదేహాలను అధికారులు గుర్తించారు. ఈ క్రమంలోనే వాళ్ల మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు. కా

ఒమన్‌లో ఇద్దరు భారతీయ ఇంజినీర్లు మృతి

ఎన్నారై డెస్క్: ఒమన్‌లో దారుణం చోటు చేసుకుంది. సుమారు 6 రోజుల క్రితం నుంచి ఆచూకీ లేకుండా పోయిన ఇద్దరు ఇంజినీర్ల మృతదేహాలను అధికారులు గుర్తించారు. ఈ క్రమంలోనే వాళ్ల మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు. కాగా.. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..


ఇద్దరు భారత ఇంజినీర్లు ఒమన్‌లోని టెలికమ్యూనికేషన్ కంపెనీలో గత కొంత కాలంగా పని చేస్తున్నారు. ఈ క్రమంలో ఎప్పటిలాగే గత నెల 28న  కంపెనీ పని మీద ధోఫార్ గవర్నేట్‌కు వెళ్లారు. అనంతరం పై అధికారులతో వాళ్లకు జూన్ 29న కమ్యూనికేషన్ కట్ అయింది. పని మీద ధోఫార్ గవర్నేట్‌కు వెళ్లిన ఇద్దరు ఇంజినీర్లు తిరిగి రాకపోవడం, వారి గురించిన ఎటువంటి సమాచారం లేకపోవడంతో సంస్థ ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో ఎయిర్ ఫోర్స్, ఆర్మీ అధికారులు.. ఎడారిలో గాలింపు చర్యలు ప్రారంభించారు. ఈ నేపథ్యంలోనే కొందరు స్థానికులు ఇద్దరి మృతదేహాలను గుర్తించినట్టు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అక్కడకు చేరుకున్న అధికారులు.. ఆ మృతదేహాలు భారత ఇంజినీర్లవే అని గుర్తించారు. అనంతరం మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు. అంతేకాకుండా ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న అధికారులు వాళ్ల మరణానికి గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు. కాగా.. ఆ ఇంజినీర్ల పేర్లు, వాళ్లు ఏ రాష్ట్రానికి చెందిన వాళ్లు అనే వివరాలను పోలీసులు వెల్లడించలేదు. 


Updated Date - 2022-07-04T15:35:52+05:30 IST