Abn logo
Feb 25 2021 @ 23:34PM

నేపాల్‌లో ఇద్దరు భారతీయులు అరెస్ట్.. కారణం ఏంటంటే!

న్యూఢిల్లీ: భారత ప్రభుత్వం రద్దు చేసిన పెద్ద నోట్లను అక్రమంగా రవాణా చేస్తూ ఇద్దరు భారతీయులు నేపాల్‌లో అరెస్ట్ అయ్యారు. వివరాల్లోకి వెళితే.. దక్షిణ నేపాల్‌లోని బారా జిల్లాలో ఉన్న చెక్‌పోస్ట్ వద్ద పోలీసులు తనిఖీలు చేస్తుండగా.. భారత్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులు సుమారు రూ.25.35లక్షల విలువైన రూ.500, రూ.1000నోట్లను అక్రమంగా రవాణా చేస్తూ పట్టుబడ్డారు. ఈ క్రమంలో వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఆ మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు. కాగా.. ఆ ఇద్దరు వ్యక్తులను చంద్రశేఖర్ ప్రసాద్ (35), సంజయ్ కుమార్ (38) గా గుర్తించినట్టు పోలీసులు తెలిపారు. వీరిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు. 


Advertisement
Advertisement
Advertisement