ఇద్దరు భారత వైద్యులకు యూఏఈ గోల్డెన్ వీసా

ABN , First Publish Date - 2021-07-10T00:57:50+05:30 IST

ఇద్దరు భారతీయులకు యూఏఈ గోల్డెన్ వీసా లభించింది. ఈ క్రమంలో వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. 34 ఏళ్ల హస్నైన్ మోతీవాలా.. గత ఏడేళ్లుగా యూఏఈలో హోమియోపతి

ఇద్దరు భారత వైద్యులకు యూఏఈ గోల్డెన్ వీసా

అబుధాబి: ఇద్దరు భారతీయులకు యూఏఈ గోల్డెన్ వీసా లభించింది. ఈ క్రమంలో వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. 34 ఏళ్ల  హస్నైన్ మోతీవాలా.. గత ఏడేళ్లుగా యూఏఈలో హోమియోపతి డాక్టర్‌గా సేవలందిస్తున్నారు. ఈ క్రమంలో ఆయనకు తాజాగా యూఏఈ ప్రభుత్వం 10 సంవత్సరాల యూఏఈ గోల్డెన్ వీసాను జారీ చేసింది. దీంతో యూఏఈలోని దావూదీ బోహ్రా కమ్యూనిటీలో యూఏఈ గోల్డెన్ వీసా పొందిన మొట్టమొదటి డాక్టర్‌గా హస్నెన్ మోతీవాలా గుర్తింపు పొందారు. దీంతో స్పందించిన ఆయన.. యూఏఈ ప్రభుత్వానికి ధన్యావాదాలు తెలిపారు. దుబాయిలోని అల్ నధా‌లోని ఓ క్లినిక్‌లో హోమియోపతి డాక్టర్‌గా పని చేస్తున్న పంజాబ్‌కు చెందిన అనుప్రియా బాత్రా.. యూఏఈ గోల్డెన్ వీసాను పొందారు. ఈ క్రమంలో ఆమె స్పందిస్తూ.. సంతోషం వ్యక్తం చేశారు. అంతేకాకుండా యూఏఈ ప్రభుత్వానికి కృతజ్ఞత‌లు తెలిపారు.


Updated Date - 2021-07-10T00:57:50+05:30 IST