పొట్టకూటి కోసం Dubai కి వెళ్లిన ఇద్దరు భారతీయులు.. ఒకే ఒక్క పనితో రాత్రికి రాత్రే వారి ఖాతాల్లోకి రూ.14 కోట్లు..!

ABN , First Publish Date - 2022-05-26T17:43:13+05:30 IST

పొట్టకూటి కోసం Dubai కి వెళ్లిన ఇద్దరు భారతీయులకు దుబాయ్ డ్యూటీ ఫ్రీ రాఫెల్‌లో జాక్‌పాట్ తలిగింది.

పొట్టకూటి కోసం Dubai కి వెళ్లిన ఇద్దరు భారతీయులు.. ఒకే ఒక్క పనితో రాత్రికి రాత్రే వారి ఖాతాల్లోకి రూ.14 కోట్లు..!

దుబాయ్: పొట్టకూటి కోసం Dubai కి వెళ్లిన ఇద్దరు భారతీయులకు దుబాయ్ డ్యూటీ ఫ్రీ రాఫెల్‌లో జాక్‌పాట్ తలిగింది. బుధవారం Dubai International Airport లో నిర్వహించిన Dubai Duty Free Millennium Millionaire డ్రాలో భారత్‌కు చెందిన రాహుల్ రామనన్, జాన్సన్ జాకబ్ చెరో 1మిలియన్ డాలర్లు (రూ.7.70కోట్లు) గెలుచుకున్నారు. యూఏఈలో ఉండే రాహుల్ ఏప్రిల్ 30న సిరీస్ నం.389లో కొనుగోలు చేసిన లాటరీ టికెట్ నం.0595 అతనికి ఈ అదృష్టాన్ని తెచ్చిపెట్టింది. అలాగే అబుదాబిలో నివాసముండే జాకబ్ జాన్సన్ మే 13న  ఆన్‌లైన్ ద్వారా కొనుగోలు చేసిన సిరీస్ నం. 390తో ఉన్న లాటరీ టికెట్ నం.4059కు జాక్‌పాట్ తగిలింది. ఇలా ఇద్దరు భారత ప్రవాసులు ఒకే డ్రాలో విజేతలుగా నిలిచి రాత్రికి రాత్రే కోటీశ్వరులుగా మారారు. 


ఇక జాకబ్ గత 8 ఏళ్ల నుంచి క్రమం తప్పకుండా దుబాయ్ డ్యూటీ ఫ్రీ రాఫెల్‌లో పాల్గొంటున్నట్లు తెలిపాడు. 16 ఏళ్లుగా అబుదాబిలో నివాసం ఉంటున్న అతడు అక్కడి అల్ ఫరా గ్రూప్‌లో సూపర్ వైజర్‌గా పని చేస్తున్నాడు. ఇంత భారీ మొత్తం గెలుచుకోవడం పట్ల ఆనందం వ్యక్తం చేసిన జాకబ్.. ఈ సందర్భంగా Dubai Duty Free Millennium Millionaire నిర్వాహకులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశాడు. అలాగే రాహుల్ కూడా లాటరీ నిర్వాహకులకు థ్యాంక్స్ చెప్పారు. తాను గెలిచిన ఈ భారీ నగదుతో తన జీవితమే మారిపోతుందని ఆనందం వ్యక్తం చేశాడు. కాగా, 1999లో ప్రారంభమైన మిలీనియం మిలియనీర్‌లో 1మిలియన్ డాలర్లు గెలుచుకున్న భారతీయుల్లో రామన్ 189వ వ్యక్తి కాగా, జాకబ్ 190వ ఇండియన్ అని రాఫెల్ నిర్వాహకులు వెల్లడించారు.     

Updated Date - 2022-05-26T17:43:13+05:30 IST