దక్షిణాఫ్రికా new coronavirus variantపై ఆరా తీస్తున్నాం

ABN , First Publish Date - 2021-11-27T16:57:13+05:30 IST

కర్ణాటక రాష్ట్రంలోని ధార్వాడ్ జిల్లాలోని ఎస్‌డీఎం వైద్యశాలలో 281 మంది వైద్య విద్యార్థులకు కరోనా సోకడంతో కళాశాల కరోనాకు హాట్ స్పాట్‌గా మారిందని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి కె సుధాకర్ చెప్పారు...

దక్షిణాఫ్రికా new coronavirus variantపై ఆరా తీస్తున్నాం

కర్ణాటక ఆరోగ్యశాఖ మంత్రి సుధాకర్ వెల్లడి

ధార్వాడ్ : కర్ణాటక రాష్ట్రంలోని ధార్వాడ్ జిల్లాలోని ఎస్‌డీఎం వైద్యశాలలో 281 మంది వైద్య విద్యార్థులకు కరోనా సోకడంతో కళాశాల కరోనాకు హాట్ స్పాట్‌గా మారిందని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి కె సుధాకర్ చెప్పారు.కర్ణాటక రాష్ట్రంలో శనివారం 24 గంటల్లో 402 కొత్త కొవిడ్ -19 కేసులు నమోదయ్యాయని మంత్రి చెప్పారు. దక్షిణాఫ్రికాలో కరోనా ఓమైక్రాన్ వేరియంట్‌ వెలుగుచూసిన నేపథ్యంలో కర్ణాటకలో పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్లు మంత్రి సుధాకర్ చెప్పారు. రాష్ట్రంలో ఇప్ప‌టి వ‌ర‌కు కొత్త వేరియ‌ంట్ ప్ర‌వేశించ‌ లేద‌ని ఆయ‌న పేర్కొన్నారు.దక్షిణాఫ్రికా దేశాల నుంచి కర్ణాటకకు వచ్చిన వ్యక్తులను గుర్తించాలని తాను హోం శాఖను, బృహత్ బెంగళూరు మహానగర పాలికను కోరినట్లు మంత్రి తెలిపారు.


తమకు కర్ణాటక రాష్ట్రంలో ఇప్పటికే ఆరు జీనోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్‌లు ఉన్నాయని, ఓమైక్రాన్ కరోనా వేరియెంట్ గురించి తాము నమూనాలు సేకరించి పరీక్షిస్తున్నామని మంత్రి వివరించారు.ఓమైక్రాన్ కొత్త కరోనా వేరియెంట్ దక్షిణాఫ్రికా, హాంకాంగ్, ఇజ్రాయెల్, బోట్స్వానాలలో కనుగొన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. అత్యంత వేగంగా వ్యాపించే కొత్త వేరియెంట్ పై ప్రజల్లో ఆందోళన నెలకొంది.ధార్వాడ్ వైద్యకళాశాల కరోనా క్లస్టరుగా మారినా తాము రాష్ట్రంలో ఎలాంటి ఆంక్షలు విధించబోమని ఆరోగ్యశాఖ మంత్రి స్పష్టం చేశారు.కర్ణాటకలో వివాహాలు సాధారణంగా సాగుతున్నాయని మంత్రి చెప్పారు. 


త్వరలో సాంస్కృతిక ఉత్సవం కూడా చేస్తున్నామన్నారు. కరోనా క్లస్టరు అయిన ఎస్డీఎం వైద్యకళాశాలకు 500 మీటర్ల పరిధిలోని పాఠశాలలు, కళాశాలలను మూసివేశామని మంత్రి చెప్పారు. వైద్యకళాశాలతోపాటు పరిసర ప్రాంతాలను శానిటైజ్ చేశామని, 8 అంబులెన్సులను వైద్య కళాశాలలో సిద్ధంగా ఉంచామని మంత్రి సుధాకర్ వివరించారు.


Updated Date - 2021-11-27T16:57:13+05:30 IST