కర్రి చెరువు వద్ద అగ్నిప్రమాదంలో రెండిళ్లు దగ్ధం

ABN , First Publish Date - 2022-05-24T06:38:32+05:30 IST

ఇంటికి వెలుగునిచ్చే విద్యుత్‌ తీగలే వారు నివసించే ఇళ్లను బుగ్గిపాలు చేశాయి. కాయకష్టం కళ్ల ఎదుటే అగ్నికి ఆహుతైంది.

కర్రి చెరువు వద్ద అగ్నిప్రమాదంలో రెండిళ్లు దగ్ధం

అల్లవరం, మే 23: ఇంటికి వెలుగునిచ్చే విద్యుత్‌ తీగలే వారు నివసించే ఇళ్లను బుగ్గిపాలు చేశాయి. కాయకష్టం కళ్ల ఎదుటే అగ్నికి ఆహుతైంది. రెక్కాడితే కానీ డొక్కాడని ఆ కూలీ కుటుంబాలు అగ్ని ప్రమాదంలో కట్టుబట్టలతో వీధినపడ్డారు. అందరూ నిద్రిస్తుండగా అగ్నికీలలు ఎగసి పడి తమ ఇళ్లను దగ్ధం చేస్తుంటే పిల్లా పాపలతో వారంతా ప్రాణభయంతో పరుగులు తీశారు. అల్లవరం మండలం దేవగుప్తం కర్రి చెరువు వద్ద సోమవారం తెల్లవారుజా మున రెండు గంటల ప్రాంతంలో విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ వల్ల అగ్ని ప్రమాదం సంభవించి రొక్కాల రాము, రొక్కాల రెడ్డిలకు చెందిన రెండు తాటాకిళ్లు పూర్తిగా కాలిపోయాయి. బీరువాలు, మంచాలు, సామగ్రి కాలిపోయాయి. సుమారు రూ.3.5లక్షల ఆస్తి నష్టం సంభవించింది. రొక్కాల రాము బీరువాలో దాచిన రూ.3వేల నగదు కాలిపోయింది. రొక్కాల రెడ్డి భార్య బీరువాలో ఉంచిన మంగళసూత్రాలు సైతం మంటల్లో కాలి బూడిదయ్యాయి. 

ప్రభుత్వపరంగా బాధిత కుటుంబాలకు అండగా ఆదు కుంటామని, పక్కా ఇళ్లు నిర్మిస్తామని మంత్రి పినిపే విశ్వ రూప్‌ చెప్పారు. బాధిత కుటుంబాలను ఆయన పరామ ర్శించారు. వైసీపీ నేత గుంటూరి బాలరాజు బాధిత కుటుం బాలకు మంత్రి సమక్షంలో రూ.40వేల ఆర్థిక సాయాన్ని అందజేశారు. మండల సర్పంచ్‌ల సమాఖ్య  అధ్యక్షుడు సాధనాల వెంకట్రావు బియ్యం పంపిణీ చేశారు.  ఎంపీపీ యిళ్ల శేషగిరిరావు, చెల్లుబోయిన శ్రీను, సాధనాల శ్రీనివాస్‌, కుడుపూడి సూర్యప్రకాష్‌, మాకే కృష్ణమూర్తి, సుందరనీడి సాయి, ఈతకోట సతీష్‌ తదితరులు పాల్గొన్నారు. 

దేవగుప్తం కర్రి చెరువు వద్ద అగ్ని ప్రమాద బాధిత కుటుంబాలను టీడీపీ పార్లమెంటరీ ఇన్‌చార్జి గంటి హరీష్‌ మాధుర్‌, మాజీ ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు పరామర్శించారు. టీడీపీ మండల అధ్యక్షుడు దెందుకూరి సత్తిబాబురాజు బాధితులకు రూ.10వేలు ఆర్థిక సాయం అందజేశారు. పోతుల నరసింహారావు బాధితులకు బి య్యం, నిత్యావసర సరుకులు ఇవ్వగా పట్టా నరసింహ స్వా మి, కోలా నరసింహస్వామి, పట్టా నాగేశ్వరరావు రూ.16వేలు ఆర్థిక సాయం అందజేశారు. కార్యక్రమంలో వేగిరాజు వెంకట్రాజు, యాళ్ల కాసుబాబు, ఎంపీటీసీ ముత్తాబత్తుల రాంబాబు తదితరులు పాల్గొన్నారు. 



Updated Date - 2022-05-24T06:38:32+05:30 IST