Abn logo
Feb 21 2021 @ 08:54AM

హైదరాబాద్‌లో మరో ఇద్దరు యువతులు అదృశ్యం

హైదరాబాద్/ఆనంద్‌బాగ్‌ : వేర్వేరు ప్రాంతాలకు చెందిన ఇద్దరు అదృశ్యమయ్యారు. మౌలాలి హనుమాన్‌నగర్‌లో నివసించే దామెర్ల ప్రియాంక(25) ఈ నెల 19న అదృశ్యమైంది. ఆమె ప్రైవేట్‌ ఉద్యోగి. ప్రియాంక తల్లి దామెర్ల సుజాత ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మౌలాలికి చెందిన సిమ్రా సనోబర్‌(20) ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం విద్యార్థిని. ఈ నెల 19న అదృశ్యమైంది. సోదరి హునయన్‌ షగుఫా ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement
Advertisement