యంగ్ హీరో నాగ శౌర్య నటించిన రెండు కొత్త చిత్రాలు ఇప్పుడు ఓటీటీలో సందడి చేయనున్నాయి. లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో నాగ శౌర్య, రీతూ వర్మ జంటగా నటించిన 'వరుడు కావలెను' నేటి నుంచి జీ 5 లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమాను సితార ఎంటర్ టైన్మెంట్ పతాకంపై సూర్య దేవర నాగ వంశీ నిర్మించారు. అలాగే, 'లక్ష్య' చిత్రం నేటి నుండి ఆహా వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో శ్రీ వేంకటేశ్వర సినిమాస్ మరియు నార్త్ స్టార్ ఎంటర్ టైన్మెంట్ పతాకాలపై ఈ సినిమాను నిర్మించారు. కేతిక శర్మ హీరోయిన్గా నటించింది. థియేటర్స్లో విడుదలైన 'వరుడు కావలెను', 'లక్ష్య' ఆశించిన విజయాలను అందుకోలేకపోయాయి. మరి ఇప్పుడు ఓటీటీలో ఏమాత్రం ఆకట్టుకుంటాయో చూడాలి.