Abn logo
Sep 21 2021 @ 12:31PM

‘రెండు జిల్లాల్లోనే అధికంగా కరోనా కేసులు’

బెంగళూరు: రాష్ట్రంలో కొవిడ్‌ కేసులు కొన్ని జిల్లాల్లో తగ్గుముఖం పడుతుండగా బెంగళూరు, తీరప్రాంత జిల్లాల్లో మాత్రం వందల్లోనే ఉన్నాయి. 11 జిల్లాల్లో 10లోపు కేసులు నమోదు కాగా 50లోపు మంది బాధితులు 8 జిల్లాల్లో నమోదయ్యాయి. 1678 మంది కోలుకోగా 24మంది మృతి చెందారు. ఇటీవలి కాలంలో ఇవే అత్యధిక మృతులు. బెంగళూరులో ఏడుగురు, బెళగావి, ఉడుపిలలో నలుగురు, హాసన్‌లో ముగ్గురు చొప్పున మృతి చెందగా దక్షిణకన్నడలో ఇరువురు, బెంగళూరు గ్రామీణ, చిత్రదుర్గ, ధార్వాడ, కోలారు జిల్లాల్లో ఒక్కొక్కరు మృతి చెందారు. 21 జిల్లాల్లో ఒక్కరు కూడా మృతి చెందలేదు.