నాట్కో నుంచి రెండు క్రిమిసంహారిణి ఉత్పత్తులు

ABN , First Publish Date - 2022-10-05T09:30:28+05:30 IST

వివిధ రకాల పంటలపై వినియోగించేందుకు నాట్కో ఫార్మా క్లోరాంట్రానిలిప్రోల్‌ (సీటీపీఆర్‌) ఆధారిత రెండు క్రిమిసంహారిణి

నాట్కో నుంచి రెండు క్రిమిసంహారిణి ఉత్పత్తులు

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): వివిధ రకాల పంటలపై వినియోగించేందుకు నాట్కో ఫార్మా క్లోరాంట్రానిలిప్రోల్‌ (సీటీపీఆర్‌) ఆధారిత రెండు క్రిమిసంహారిణి ఉత్పత్తులను మార్కెట్‌లోకి విడుదల చేసింది. సీటీపీఆర్‌ 8.8ు, థైమీథాక్సమ్‌ 17.5ు కలిగిన ఉత్పత్తిని నాట్వాల్‌ బ్రాండ్‌తో విడుదల చేసినట్లు పేర్కొంది. నాట్లి గో పేరుతో 9.3ు సీటీపీఆర్‌, ల్యాంబ్డా-సైహాలోత్రిన్‌ 4.6ు జెడ్‌సీ ఉత్పత్తిని ప్రవేశపెట్టినట్లు వెల్లడించింది. సింజెంటా కంపెనీ వాలియమ్‌ ఫ్లెక్స్‌, యాంప్లిగో బ్రాం డ్‌లతో ఈ ఉత్పత్తులను ప్రస్తుతం విక్రయిస్తోంది. తాజాగా నాట్కో ఫార్ములేషన్లను విడుదల చేసింది వీటి మార్కెట్‌ విలువ రూ.800 కోట్లు ఉంటుందని అంచనా.

Updated Date - 2022-10-05T09:30:28+05:30 IST