Abn logo
Sep 26 2021 @ 00:22AM

డెంగ్యూతో ఇద్దరి మృతి

చీడికాడ, సెప్టెంబరు 25: మండలంలోని జి.కొత్తపల్లి గ్రామానికి చెందిన ఒక వృద్ధుడు, మరో బాలిక డెంగ్యూతో బాధపడుతూ విశాఖ ప్రైవేటు ఆస్పత్రిలో మృతిచెందారు. కుటుంబ సభ్యులు అందించిన వివరాలాలా ఉన్నాయి. కొత్తపల్లికి చెందిన కురచా నారాయణమూర్తి కుమార్తె కురచా భార్గవి (9)కి పది రోజుల క్రితం జ్వరం వచ్చింది.  విశాఖలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించి పరీక్షలు చేయించగా.. డెంగ్యూగా నిర్ధారించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం వేకువజామున భార్గవి మృతిచెందినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. అదే గ్రామానికి చెందిన సబ్బవరపు సోములు (60) వారం రోజులుగా డెంగ్యూతో విశాఖ కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ శుక్రవారం సాయంత్రం మృతి చెందినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.


మరో 37 మందికి కరోనా

విశాఖపట్నం, సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో మరో 37 మందికి కరోనా వైరస్‌ సోకినట్టు శనివారం నిర్ధారణ అయింది. వీటితో మొత్తం కేసుల సంఖ్య 1,56,954కు చేరింది. ఇందులో 1,54,933 మంది కోలుకున్నారు. చికిత్స పొందుతూ ఒకరు మృతి చెందడంతో కొవిడ్‌ మరణాల సంఖ్య 1087కు చేరింది.