సెప్టిక్ ట్యాంకు శుభ్రం చేస్తూ ఇద్దరు కార్మికుల మృతి

ABN , First Publish Date - 2020-10-20T13:53:49+05:30 IST

సెప్టిక్ ట్యాంకును శుభ్రం చేసేందుకు దిగిన ఇద్దరు కార్మికులు విషపు గాలి వల్ల మరణించిన ఘటన ఢిల్లీలోని ఆజాద్ పూర్ ప్రాంతంలో జరిగింది....

సెప్టిక్ ట్యాంకు శుభ్రం చేస్తూ ఇద్దరు కార్మికుల మృతి

న్యూఢిల్లీ : సెప్టిక్ ట్యాంకును శుభ్రం చేసేందుకు దిగిన ఇద్దరు కార్మికులు విషపు గాలి వల్ల మరణించిన ఘటన ఢిల్లీలోని ఆజాద్ పూర్ ప్రాంతంలో జరిగింది. ఆజాద్ పూర్ ప్రాంతంలోని గోల్డ్ ఫ్యాక్టరీలోని జీ బ్లాకులో ఉన్న సెప్టెక్ ట్యాంకును శుభ్రం చేసేందుకు ముగ్గురు కార్మికులు  దిగారు. వారిలో ఇద్దరు విషపు వాయువు పీల్చడంతో మృత్యువాత పడ్డారు. అగ్నిమాపకశాఖ వారు వచ్చి మృతదేహాలను వెలికితీశారు. జీటీ కర్నాల్ రోడ్డు పారిశ్రామికవాడలోని బంగారం, వెండి చైన్ల తయారీ పరిశ్రమలోని సెప్టిక్ ట్యాంకులో ఈ ప్రమాదం జరిగింది. 


పరిశ్రమ యజమాని రాజేందర్ సోని ట్యాంకును శుభ్రం చేసే పనిని కాంట్రాక్టరు ప్రమోద్ దాంగీకి అప్పగించారని పోలీసులు చెప్పారు. ట్యాంకులోకి దిగిన కార్మికులు ఇద్రీస్, సలీంలు మరణించారు. పరిశ్రమ యజమాని, కాంట్రాక్టరుపై కేసు నమోదు చేసి వారిని  అరెస్టు చేశామని డీసీపీ చెప్పారు.

Updated Date - 2020-10-20T13:53:49+05:30 IST