రెండు వజ్రాలు లభ్యం

ABN , First Publish Date - 2022-08-17T05:34:10+05:30 IST

రెండు విలువైన వజ్రాలు లభ్యమయ్యాయి. మంగళవారం మండలంలోని జొన్నగిరికి చెందిన ఓ వ్యవసాయ కూలీకి వజ్రం దొరికింది.

రెండు వజ్రాలు లభ్యం

తుగ్గలి, ఆగస్టు 16: రెండు విలువైన వజ్రాలు లభ్యమయ్యాయి. మంగళవారం మండలంలోని జొన్నగిరికి చెందిన ఓ వ్యవసాయ కూలీకి వజ్రం దొరికింది. దానిని స్థానిక వజ్రాల వ్యాపారి రూ.40వేలకు కొనుగోలు చేశాడు. అలాగే ఇతర ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తికి కూడా వజ్రం దొరికింది. దాన్ని గుత్తికి చెందిన వజ్రాల వ్యాపారులు గుట్టు చప్పుడు కాకుండా రూ.3.30 లక్షలకు కొన్నట్లు సమాచారం. ఇతర ప్రాంతాల్లో దొరికిన వజ్రాలను జొన్నగిరిని అడ్డాగా చేసుకున్న గుత్తి వ్యాపారులు కొంటున్నారు. దీంతో బైటి ప్రాంతాల నుంచి వస్తున్న వజ్రాల అన్వేషకులతో తమ ప్రాంతంలో  పంట పొలాలు నాశనం అవుతున్నాయని  జొన్నగిరి ప్రాంత  రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  


Updated Date - 2022-08-17T05:34:10+05:30 IST