Abn logo
Jul 13 2021 @ 10:53AM

flash floods: హిమాచల్ ప్రదేశ్‌లో ఇద్దరు మృతి

10 మంది గల్లంతు

కాంగ్రా (హిమాచల్ ప్రదేశ్): హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో కురుస్తున్న కుండపోత వర్షాలతో వరదలు వెల్లువెత్తుతున్నాయి. కాంగ్రా జిల్లాలో ఒక్కసారిగా పోటెత్తిన వరదల కారణంగా ఇద్దరు మరణించగా, మరో 10 మంది గల్లంతు అయ్యారు.ట్రిండ్ ట్రెక్కింగ్ మార్గంలో వరదల్లో చిక్కుకున్న 80 మంది విద్యార్థులను స్టేట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ సభ్యులు కాపాడారు. బోహ్ గ్రామం వరదనీటిలో మునిగిపోయింది.వరదల వల్ల 11 ఇళ్లు, పలు వాహనాలు దెబ్బతిన్నాయి. వరద తాకిడి వల్ల 60 రోడ్లను మూసివేశారు.భారీవర్షాల కురుస్తుండటంతో ఎల్లో అలర్ట్ జారీ చేశామని కుల్లూ అదనపు డిప్యూటీ కమిషనర్ ప్రకాష్ సింగ్ చెప్పారు. 25 రోడ్లు జలమయం అయ్యాయని, 8 విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్లు నీటమునగడంతో విద్యుత్ సరఫరాను నిలిపివేశామని ప్రకాష్ సింగ్ చెప్పారు. లాహౌల్ స్పితి జాతీయ రహదారిపై పలు వాహనాలు వరదనీటిలో కొట్టుకుపోయాయి. ధర్మశాలతోపాటు పర్యాటక ప్రాంతాల్లో కురిసన భారీవర్షాల వల్ల పలు వాహనాలు, ఇళ్లు దెబ్బతిన్నాయి. నేషనల్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ బృందాలు రంగంలోకి దిగి వరద సహాయ పునరావాస పనులు చేపట్టాయి.