Uttarakhand:మెరుపు వరదల్లో ఇద్దరి మృతి, ఏడుగురి గల్లంతు

ABN , First Publish Date - 2021-08-30T16:41:58+05:30 IST

ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ధార్చుల జుమ్మా గ్రామంలో మెరుపు వరదల వల్ల ఇద్దరు మరణించగా, మరో ఏడుగురు అదృశ్యమయ్యారు....

Uttarakhand:మెరుపు వరదల్లో ఇద్దరి మృతి, ఏడుగురి గల్లంతు

డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ధార్చుల జుమ్మా గ్రామంలో మెరుపు వరదల వల్ల ఇద్దరు మరణించగా, మరో ఏడుగురు అదృశ్యమయ్యారు.భారీవర్షాలు, క్లౌడ్ బరస్ట్ వల్ల మెరుపు వరదలు సంభవించాయి.ఈ వరదల్లో 7 ఇళ్లు దెబ్బతిన్నాయి. రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం హుటాహుటిన వచ్చి వరద సహాయ పునరావాస పనులు చేపట్టింది. భారీవర్షాల వల్ల ధార్చుల ఎన్‌హెచ్‌పీసీ కాలనీలో వరదనీరు నిలిచింది.పితోర్‌గఢ్ జిల్లాలో గత  ఐదు రోజులుగా ఎడతెరిపి లేకుండా భారీవర్షాలు కురుస్తుండడంతో అనేక కొండచరియలు విరిగిపడ్డాయి. పిథోరఘర్‌లోని ధార్చుల సబ్ డివిజన్‌లోని జోషి గ్రామంలో గత వారం 23 ఏళ్ల యువతి అదృశ్యమైంది.




పితోర్‌గఢ్ జిల్లాలో కొండచరియలు విరిగిపడటంతో కనీసం ఇద్దరు మరణించగా, మరో ఐదుగురు శిథిలాల కింద పడి ఉన్నారని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి సోమవారం తెలిపారు.ఉత్తరాఖండ్‌లోని నైనిటాల్, బాగేశ్వర్, పితోరాఘర్ జిల్లాల్లో సోమవారం భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) శనివారం ఎల్లో అలర్ట్ ప్రకటించింది.

Updated Date - 2021-08-30T16:41:58+05:30 IST