ఇద్దరు సైబర్‌ నేరగాళ్ల అరెస్టు

ABN , First Publish Date - 2020-06-30T10:44:34+05:30 IST

మాయమాటలతో ఎంపీ, ఎమ్మెల్సీనే బురడా కొట్టించాలనుకొన్న ఇద్దరిని ఎమ్మెల్సీ మహ్మద్‌ ఇక్బాల్‌ ప్రత్యేక చొరవతో హిందూపురం

ఇద్దరు సైబర్‌ నేరగాళ్ల అరెస్టు

 వివరాలు వెల్లడించిన పెనుకొండ డీఎస్పీ


హిందూపురం టౌన్‌, జూన్‌ 29 : మాయమాటలతో ఎంపీ, ఎమ్మెల్సీనే బురడా కొట్టించాలనుకొన్న ఇద్దరిని ఎమ్మెల్సీ మహ్మద్‌ ఇక్బాల్‌ ప్రత్యేక చొరవతో హిందూపురం పోలీసులు ఆటకట్టించారు. వారి అరెస్ట్‌ వివరాలను సోమవారం రాత్రి హిందూపురం టూటౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో పెనుకొండ డీఎస్‌పీ మహబూబ్‌బాషా వెల్లడించారు. తూర్పుగోదావరి జిల్లా కిర్లం పుడికి చెందిన తోట బాలాజీనాయుడు, రావులపాళ్యం ఈదుల లంక గ్రామానికి చెందిన మల్లిరెడ్డి వెంకటతాతారెడ్డి ముఠాగా ఏర్పడ్డారు. వారు శనివారం సాయంత్రం హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌కు ఫోన్‌చేసి పరిశ్రమల శాఖ డిప్యూటీ కార్య దర్శి మాట్లాడుతున్నానని ప్రధానమంత్రి ఇటీవల ప్రకటించిన రూ. 20లక్షల కోట్ల ప్యాకేజీలో భాగంగా నియోజకవర్గంలో 20 మందికి ఒక్కొక్కరికి రూ.50లక్షలు వంతున అందజేస్తామ న్నారు.


అయితే ఇందులో 50శాతం సబ్సిడీ ఉంటుందని తెలి పారు. అయితే ఎంపీ హిందూపురం నియోజకవర్గానికి సం బంధించి ఎమ్మెల్సీ మహ్మద్‌ ఇక్బాల్‌ను సంప్రదించాలన్నారు. దీంతో ఎమ్మెల్సీకి ఫోన్‌చేసిన సైబర్‌ నేరగాళ్లు ఇదే విషయం తెలిపారు. లబ్ధిదారుడి వాటాకింద 5శాతంతో రూ.1.25లక్షలు వెంటనే తన గూగుల్‌పే అకౌంట్‌కు బదిలీ చేయాలని లేదంటే వెబ్‌సైట్‌ క్లోజ్‌ అవుతుందన్నారు. ఇదే ఆఖరి రోజు అన్నారు.  మంత్రి పర్యటన ఏర్పాట్లలో బిజీగా ఉన్న ఎమ్మెల్సీ ఆ పనిని వైసీపీ నాయకుడు గోపీకృష్ణకు అప్పగించి, నియోజక వర్గంలోని వైసీపీ నాయకుల నుంచి నగదు బదిలీ చేయించా రు.  అయితే రాత్రి 11 గంటల సమయంలో ఎమ్మెల్సీకి అను మానం వచ్చి పరిశ్రమల శాఖ ముఖ్య అఽధికారితో మాట్లాడా రు. అలాంటి పథకాలేవీ లేవని ఆయన తెలపడంతో ఎమ్మెల్సీ జిల్లా ఎస్‌పీకి సమాచారం ఇచ్చారు.


అనంతరం తూర్పు గోదా వరి జిల్లా, మరో రెండు జిల్లాల ఎస్పీలకు విషయం తెలిపారు. వారిద్దరు తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురంలో ఉన్నట్లు ఆదివారం గుర్తించారు. జిల్లా నుంచి అక్కడకు ప్రత్యేక బృం దాన్ని పంపి సోమవారం సాయంత్రం అదుపులోకి తీసుకు న్నారు. విచారణలో నేరం ఒప్పుకోవడంతో వారిని అరెస్ట్‌చేసి కోర్టులో హాజరుపరిచారు. బదిలీ చేసిన రూ.8.52లక్షల నగదు ను అక్కడ ఎస్‌బీఐ మేనేజర్‌తో మాట్లాడి సీజ్‌ చేయించారు. వారిపై ఇప్పటికే 40 చీటింగ్‌ కేసులున్నట్లు డీఎస్పీ తెలిపారు. సైబర్‌ నేరగాళ్లను తీసుకొచ్చిన ఎస్‌ఐ శేఖర్‌, కానిస్టేబుల్‌ తిరుమ లేశ్‌, రాము, హరిన ఎస్పీ, డీఎస్పీ అభినందించారు. 

Updated Date - 2020-06-30T10:44:34+05:30 IST