Abn logo
Aug 12 2021 @ 12:48PM

Delhi: పోలీసుల ఎన్‌కౌంటర్...ఇద్దరు నేరగాళ్లు హతం

న్యూఢిల్లీ : దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో గురువారం జరిగిన ఎన్‌కౌంటరులో ఇద్దరు కరడు కట్టిన నేరగాళ్లు హతం అయ్యారు. పలు నేరాల్లో నిందితులైన అమీర్ ఖాన్ రాజ్ మాన్ లు ఢిల్లీలోని ఖజూరీఖాస్ ప్రాంతంలో శ్రీరామ కాలనీలో అద్దె గదిలో ఉన్నారు. వీరిద్దరూ హత్యలు, దోపిడీలతో పాటు పలు కేసుల్లో నిందితులు. నేరగాళ్లు ఓ గదిలో ఉన్నారని భవన యజమాని ద్వారా తెలుసుకున్న పోలీసులు చుట్టుముట్టి లొంగిపొమ్మని కోరారు. తమ వద్ద పెద్ద ఎత్తున మందుగుండు సామాగ్రి ఉందని, దీంతో తాము ఆత్మాహుతి చేసుకోవడంతోపాటు భవనాన్ని పేలుడు పదార్థాలతో పేల్చివేస్తామని నేరగాళ్లు బెదిరించారు.

 దీంతో పోలీసులు భవనంలోని వారిని సురక్షిత ప్రాంతానికి తరలించి నేరస్థులున్న గది తలుపులను పగులగొట్టారు. దీంతో నేరగాళ్లు కాల్పులకు దిగారు. నేరగాళ్ల కాల్పుల్లో ఇద్దరు పోలీసులు గాయపడ్డారు. దీంతో పోలీసులు ఎదురుకాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరు నేరగాళ్లు హతమయ్యారు. నేరగాళ్ల గదిలో రెండు ఆటోమేటిక్ పిస్టళ్లు, 4 మేగజైన్లు, మందుగుండు సామాగ్రి, తూటాలు, లక్షరూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. 


క్రైమ్ మరిన్ని...