Abn logo
Sep 22 2021 @ 00:43AM

మండల పీఠానికి ఇద్దరు పోటీ

పదవిని ఆశిస్తున్న గొలుగొండ, కృష్ణాదేవిపేట ఎంపీటీసీలు



గొలుగొండ, సెప్టెంబరు 21:  మండల పరిషత్‌ అధ్యక్ష పదవి ఎస్సీ మహిళకు రిజర్వు కావడంతో ఈ కేటగిరీ నుంచి వైసీపీ తరపున గెలుపొందిన ఇద్దరు ఎంపీటీసీలు ఈ పదవికి పోటీ పడుతున్నారు. మండలంలో 15 ఎంపీటీసీ స్థానాలకుగాను 14 స్థానాలు ఫలితాలు ప్రకటించారు. వీటిలో 13 స్థానాలను వైసీపీ దక్కించుకుంది. ఎంపీపీ పదవి ఎస్సీ మహిళకు రిజర్వు అయ్యింది. మండలంలో కృష్ణాదేవిపేట, గొలుగొండ ఎంపీటీసీలు మాత్రమే ఈ కేటగిరీకి కేటాయించారు. కృష్ణాదేవిపేట నుంచి గజ్జలపు మణికుమారి, గొలుగొండ నుంచి చేపల చినపాప గెలుపొందారు. ఇద్దరూ వైసీపీ వారే కావడంతో ఎంపీపీ పదవి కోసం పోటీ పడుతున్నారు.  అయితే ఎమ్మెల్యే ఎవరి పేరు ప్రకటిస్తే వారికే పదవి దక్కుతుందని మండల నేతలు అంటున్నారు. కాగా వైస్‌ ఎంపీపీ రేసులో ఏఎల్‌పురం-3 ఎంపీటీసీ చింతల ప్రసాద్‌, పాతమల్లంపేట ఎంపీటీసీ సోమల యమున, కొత్తఎల్లవరం ఎంపీటీసీ వంగల పెదదేముడు పోటీ పడుతున్నారు