మంటల్లో రెండు రైలు బోగీలు.. నెట్టేసిన ప్రయాణికులు

ABN , First Publish Date - 2022-03-06T20:25:54+05:30 IST

రైల్వే అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. పవర్ ఇంజన్ ట్రాన్స్‌ఫార్మర్ రైలు బోగీలకు మధ్యలో ఉందని, ప్రమాదవశాత్తు అందులో మంటలు సంభవించాయని తెలిపారు. ఆ మంటలు రైలు ఇంజిన్‌కు సమీపంలో ఉన్న రెండు బోగీల్లోకి వ్యాపించాయని..

మంటల్లో రెండు రైలు బోగీలు.. నెట్టేసిన ప్రయాణికులు

లఖ్‌నవూ: ఉన్నట్టుండి రైలులోని రెండు బోగీలు అగ్ని ప్రమాదానికి గురయ్యాయి. వెంటనే ప్రయాణికులు అప్రమత్తమై.. మిగిలిన బోగీలకు మంటలు అంటుకోకుండా ఆ బోగీలను రైలుకు దూరంగా నెట్టేశారు. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ సమీపంలో ఉన్న దౌరాలా రైల్వే స్టేషన్‌లో ఆదివారం జరిగిందీ ఘటన. ఢిల్లీ నుంచి సహరన్‌పూర్ వెళ్తున్న ప్యాసింజర్ రైలు దౌరాలాకు చేరుకోగానే రైలులోని రెండు బోగీల్లో మంటలు అంటుకున్నాయి. అప్పటికి రైలు స్టేషన్‌లో ఆగే ఉంది. అయితే ఆ మంటలు మిగతా బోగీలతో పాటు రైలు ఇంజన్‌కు అంటుకోకుండా ప్రయాణికులే దూరంగా నెట్టేశారు. ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయం కాలేదని స్థానిక రైల్వే అధికారులు పేర్కొన్నారు.


రైల్వే అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. పవర్ ఇంజన్ ట్రాన్స్‌ఫార్మర్ రైలు బోగీలకు మధ్యలో ఉందని, ప్రమాదవశాత్తు అందులో మంటలు సంభవించాయని తెలిపారు. ఆ మంటలు రైలు ఇంజిన్‌కు సమీపంలో ఉన్న రెండు బోగీల్లోకి వ్యాపించాయని, కానీ ప్రయాణికులు అప్రమత్తమై రెండు బోగీల్ని ఇంజన్‌కు దూరంగా నెట్టేశారని పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.



Updated Date - 2022-03-06T20:25:54+05:30 IST