Abn logo
Aug 9 2020 @ 14:36PM

తూ.గో.జిల్లా: ఇద్దరు చిన్నారుల అదృశ్యం విషాదాంతం

తూ.గో.జిల్లా: రావులపాలెం మండలం, రావులపాడులో అదశ్యమైన చిన్నారుల కథ విషాదాంతమైంది. పంటకాలువలో పడి వారు మృతి చెందారు. అందులో ఒక బాలుడి మృతదేహం లభ్యమైంది. మరో చిన్నారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. మూడు రోజుల క్రితం ఇద్దరు చిన్నారులు అదృశ్యమయ్యారు. దీంతో కుటుంబసభ్యులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు చిన్నారుల కోసం గాలించినా ఆచూకి లభించలేదు. చిన్నారులు పంటకాలువలో పడి మృతి చెందినట్లుగా ఆదివారం గుర్తించారు. ఇద్దరు చిన్నారుల్లో ఒకరికి ఆరేళ్లు కాగా, మరో చిన్నారికి ఐదేళ్లు. కాలువ గట్టుపై గుడారాల్లో నివశించే కుటుంబాలకు చెందిన పిల్లలు ఆడుకుంటూ కళ్లెదుటే తిరిగారు. ఒక్కసారిగా కనిపించకుండాపోయారు. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Advertisement
Advertisement
Advertisement