ఆడుతూ కారులో ఇరుక్కున్న చిన్నారులు.. ఊపిరాడక మృతి

ABN , First Publish Date - 2022-06-14T19:32:47+05:30 IST

ఇద్దరు చిన్నారులు ఆడుకుంటూ కారులో ఇరుక్కుపోయారు. కారు డోర్లు లాక్ అయిపోవడంతో ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బదౌన్‌లో జరిగిందీ ఘటన. తాము చూసే సరికి చిన్నారులు స్కార్పియో కారులో..

ఆడుతూ కారులో ఇరుక్కున్న చిన్నారులు.. ఊపిరాడక మృతి

లఖ్‌నవూ: ఇద్దరు చిన్నారులు ఆడుకుంటూ కారులో ఇరుక్కుపోయారు. కారు డోర్లు లాక్ అయిపోవడంతో ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బదౌన్‌లో జరిగిందీ ఘటన. తాము చూసే సరికి చిన్నారులు స్కార్పియో కారులో అపస్మారక స్థితిలో ఉన్నారని, అయితే కారు తలుపులు తెరిచి చూడగా అప్పటికే మరణించారని స్థానిక పోలీసులు తెలిపారు. చిన్నారుల ఇద్దరి మృతదేహాల్ని పోస్ట్ మార్టం కోసం పంపించామని వారు పేర్కొన్నారు.


చిన్నారుల ఇద్దరి పేర్లు సలీమ్(5), అయాన్(5). సోమవారం ఇంటి ఆవరణలో ఆడుకుంటున్నారు. ఆడుతూ ఆడుతూ కారులో ఎక్కారు. ఈ క్రమంలో కారు డోర్లు లాక్ అయిపోయాయి. సాయంత్రం అయినా పిల్లలు కనిపించకపోయే సరికి వారి కోసం వెతకడం ప్రారంభించారు కుటుంబ సభ్యులు ఎక్కడా కనిపించకపోవడంతో రాత్రి 10 గంటలకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు ఇంటికి వచ్చి పరిశీలించగా ఇంటి పక్కన పార్క్ చేసి ఉన్న కారులో అపస్మారక స్థితిలో కనిపించారు. పోలీసులు గుర్తించి కారు తలుపులు తెరిచి చూడగా.. ఊపిరాడక అప్పటికే మరణించారు.

Updated Date - 2022-06-14T19:32:47+05:30 IST