నెల్లూరు: జిల్లాలో విషాదం నెలకొంది. చెరువులో పడి ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. ఈ సంఘటన గూడూరు రూరల్ విందూరు గిరిజన కాలనీలో చోటుచేసుకుంది. కాలనీకి చెందిన శ్రీహరి(6), మల్లికార్జున(5) అనే ఇద్దరు చిన్నారులు చెరువులోకి దిగారు. అయితే వారికి ఈత రాకపోవడంతో నీటిలో పడి మృతి చెందారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.