షాపులో తుపాకులతో చొరబడి.. NRIని దారుణంగా..

ABN , First Publish Date - 2021-09-06T04:14:36+05:30 IST

ఓ భారతీయ అమెరికన్ వ్యక్తిని దారుణంగా హతమార్చిన కేసులో ఇద్దరు నిందితులను ఒహాయో కోర్టు గ్రాండ్ జ్యూరీ దోషులుగా తేల్చింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన ఈ హత్య కేసులో తాజాగా జ్యూరీ తన తీర్పు వెలువరించింది. దొంగతనం చేసే ఉద్దేశంతోనే మృతుడి షాపులోకి ఇద్దరు దోషులూ దూరి..

షాపులో తుపాకులతో చొరబడి.. NRIని దారుణంగా..

ఓ భారతీయ అమెరికన్ వ్యక్తిని దారుణంగా హతమార్చిన కేసులో ఇద్దరు నిందితులను ఒహాయో కోర్టు గ్రాండ్ జ్యూరీ దోషులుగా తేల్చింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన ఈ హత్య కేసులో తాజాగా జ్యూరీ తన తీర్పు వెలువరించింది. దొంగతనం చేసే ఉద్దేశంతోనే మృతుడి షాపులోకి ఇద్దరు దోషులూ దూరి అతడిని హతమార్చినట్లు కోర్టు నిర్ధారించింది. వివరాల్లోకి వెళితే.. రూప్ సీ గుప్తా ఒహాయోలోని సిన్‌సినాటీలో కెన్‌వుడ్ రోడ్‌లో ఉన్న మదీరా బేవరేజెస్ కన్వీనియన్స్ స్టోర్ నడుపుతున్నారు. అయితే ఫిబ్రవరి 9న సిన్సినాటీకే చెందిన విల్లీ జేమ్స్ అట్టావే(30), ల్యామండ్ జాన్స‌న్(35)లు ఉన్నట్లుండి స్టోర్‌లోకి ప్రవేశించారు. తుపాకులతో గుప్తాను బెదిరించి దోచుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే గుప్తాను కాల్చి చంపారు. 


కేసులో ఇద్దరినీ అరెస్టు చేసిన పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టారు. కేసును విచారించిన ఒహాయో ఫెడరల్ కోర్టు గ్రాండ్ జ్యూరీ ఒహాయో సౌతర్న్ డిస్ట్రిక్ట్ యునైటెడ్ స్టేట్స్ అట్టార్నీ విపల్ జే పటేల్, యూఏస్ బ్యూరో ఆప్ ఆల్కహాల్, టొబాక్కో, ఫైర్ ఆర్మ్స్ అండ్ ఎక్స్‌ప్టోసివ్స్ స్పెషల్ ఏజెంట్ ఇంచార్జ్ రోలాండ్ హెర్న్‌డన్ సెప్టెంబరు 2న విచారణ జరిపారు. ఈ విచారణలో ఇద్దరు నిందితులనూ దోషులుగా తేల్చారు. 


కాగా.. డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్ మీడియాకు విడుదల చేసిన సమాచారం ప్రకారం.. నిందితులు అట్టావే, జాన్సన్‌లు ఫిబ్రవరి 8, 9 తేదీల్లో దాదాపు 5 రాబరీలు చేసినట్లు తెలుస్తోంది. ఇక ఇలాంటి కేసుల్లో హత్య చేసిన నిందితులకు మరణదండన విధించే అవకాశం కూడా ఉంది. 


Updated Date - 2021-09-06T04:14:36+05:30 IST