Keralaలో ఇద్దరు పిల్లలకు కొత్తరకం noro virus

ABN , First Publish Date - 2022-06-06T13:46:21+05:30 IST

కేరళ రాష్ట్రంలో కొత్తరకం నోరో వైరస్ అంటువ్యాధి ప్రబలింది....

Keralaలో ఇద్దరు పిల్లలకు కొత్తరకం noro virus

తిరువనంతపురం : కేరళ రాష్ట్రంలో కొత్తరకం నోరో వైరస్ అంటువ్యాధి ప్రబలింది. తిరువనంతపురం నగరంలో ఇద్దరు పిల్లలకు నోరో వైరస్ సోకిందని కేరళ వైద్యాధికారులు ధృవీకరించారు. నోరోవైరస్ డయేరియా-ప్రేరేపిత రోటవైరస్ మాదిరిగానే ఉంది. ఈ వైరస్ సోకిన పిల్లలకు చికిత్స చేయకపోతే ప్రాణాంతకం కావచ్చని వైద్యులు హెచ్చరించారు.కలుషిత నీరు, ఆహారం ద్వారా వైరస్ వ్యాప్తి చెందుతుంది కాబట్టి ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నట్లు అధికారులు చెప్పారు. ఈ ప్రాంతంలో నీటి పరిశుభ్రతపై సరైన చర్యలు తీసుకుంటే వ్యాధిని అదుపు చేయవచ్చని అధికారులు చెప్పారు.నోరో వైరస్ సోకిన పిల్లల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ప్రజలంతా ఈ వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండాలని కేరళ ఆరోగ్యశాఖ మంత్రి జార్జ్ చెప్పారు.


ఫుడ్ పాయిజనింగ్ అని ఫిర్యాదు చేసిన తర్వాత పిల్లల్లో నోరోవైరస్ ఇన్ఫెక్షన్ కనుగొన్నారు. పాఠశాలలో మధ్యాహ్న భోజనం చేసిన తర్వాత పిల్లలకు ఈ లక్షణాలు కనిపించాయని అధికారులు అనుమానిస్తున్నారు.నోరోవైరస్ సోకిన రోగులు వాంతులు,విరేచనాలు, తలనొప్పి, శరీర నొప్పులతో బాధపడుతుంటారు. కలుషితమైన ఆహారం, నీరు వల్ల ఈ వైరస్ వ్యాపిస్తుంది.లావెటరీని ఉపయోగించిన తర్వాత సబ్బుతో పదేపదే చేతులు కడుక్కోవడం వంటి జాగ్రత్తలు పాటించాలని వైద్యులు ప్రజలను కోరారు.

Updated Date - 2022-06-06T13:46:21+05:30 IST