గుంటూరు: జనసేన అధినేత పర్యటనలో అపశృతి చోటు చేసుకుంది. మంగళగిరి డీజీపీ కార్యాలయ సమీపంలోకి ఆయన కాన్వాయ్ రాగానే.. కాన్వాయ్‌లోని రెండు కార్లు ఢీకొన్నాయి. ఎయిర్‌బ్యాగ్స్ తెరుచుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. కాగా.. జనసేన, వైసీపీ మధ్య రచ్చ రగులుతూనే ఉంది. ‘రిపబ్లిక్’ సినిమా ప్రీరిలీజ్ వేడుకలో సినిమా రంగ సమస్యలను ప్రస్తావిస్తూ జనసేనాధిపతి పవన్ కల్యాణ్ ఏపీ సర్కారుపైనా, మంత్రి పేర్ని నానిపైనా విరుచుకుపడిన సంగతి తెలిసిందే. దీనిపై పేర్ని నానితోపాటు పలువురు మంత్రులు ఘాటుగా స్పందించారు. దీంతో పవన్ కూడా ట్విటర్ వేదికగా కౌంటర్ ఇచ్చారు. ఇక పవన్ వర్సెస్ వైసీపీ నేతల మధ్య జరుగుతున్న వార్‌కి సినీ నటుడు, రచయిత పోసాని కృష్ణ మురళి మరింత ఆజ్యం పోశారు. ఈసారి ఆయన పవన్ కల్యాణ్‌పై బూతులతో విరుచుకుపడ్డారు. దీంతో ఈ వ్యవహారం తారాస్థాయికి చేరుకుంది. ఈ క్రమంలోనే పవన్ ఏపీలో కృష్ణా, గుంటూరు జిల్లాల పర్యటనకు పూనుకున్నారు.