Pakistan : ఆహారంలో బొద్దింకలు... పార్లమెంటు కేంటీన్లకు సీలు...

ABN , First Publish Date - 2022-07-31T20:48:26+05:30 IST

పాకిస్థాన్ పార్లమెంటు హౌస్ (Pakistan Parliament House

Pakistan : ఆహారంలో బొద్దింకలు... పార్లమెంటు కేంటీన్లకు సీలు...

ఇస్లామాబాద్ : పాకిస్థాన్ పార్లమెంటు హౌస్ (Pakistan Parliament House) కేంటీన్లలో తయారైన ఆహారంలో బొద్దింకలు (cockroaches) దర్శనమివ్వడంతో అధికారులు ఆ కేంటీన్లను మూసివేశారు. ఇక్కడ నాసిరకం ఆహారం అందుబాటులో ఉంచుతున్నందువల్ల ఇప్పటికే చాలా మంది ఎంపీలు ఇక్కడి ఆహారాన్ని స్వీకరించడం మానేశారు. 


తాజాగా తమకు వడ్డించిన ఆహారంలో బొద్దింకలు ఉండటాన్ని గమనించిన పార్లమెంటేరియన్లు ఇస్లామాబాద్ (Islamabad) జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన అధికారులు  రెండు కేంటీన్లలో  తనిఖీలు నిర్వహించారు. కస్టమర్లు ఆహారాన్ని తినే ప్రదేశంలో పురుగులు, వంట గదిలో అపరిశుభ్రత, అనారోగ్యానికి దారి తీసే పరిస్థితులు ఉన్నట్లు గుర్తించారు. ఆ రెండు కేంటీన్లను సీల్ చేశారు. 


పార్లమెంట్ హౌస్ కేంటీన్లలో ఇటువంటి సంఘటన జరగడం కొత్త కాదు. 2014లో కెచప్ సీసాలో (ketchup bottle)  బొద్దింక కనిపించింది. ఇక్కడ వాడుతున్న మాంసం నాణ్యత గురించి 2019లో  ఎంపీలు ప్రశ్నలు సంధించారు. పార్లమెంట్ లాడ్జీల్లో కూడా గతంలో ఎలుకలు కనిపించాయి. 


Updated Date - 2022-07-31T20:48:26+05:30 IST