శోక సంద్రం

ABN , First Publish Date - 2022-06-25T06:08:46+05:30 IST

అల్లారు ముద్దుగా పెంచుకున్న ఇద్దరు కుమా రులు.. కరెంట్‌ షాక్‌తో కళ్ల ముందే మాంసం ముద్దలుగా కనిపించడంతో ఆ తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు.

శోక సంద్రం
నాగేంద్ర (ఫైల్‌)

అన్నదమ్ములను బలిగొన్న విద్యుత్‌ వైరు

పాలు తీసేందుకు పొలం వెళుతుండగా కరెంట్‌ షాక్‌

బైక్‌ సహా కాలిపోయిన మృతదేహాలు

గుండెలవిసేలా రోదించిన తల్లిదండ్రులు

విద్యుత్‌ శాఖాధికారులపై గ్రామస్థుల ఆగ్రహం

అల్లారు ముద్దుగా పెంచుకున్న ఇద్దరు కుమా రులు.. కరెంట్‌ షాక్‌తో కళ్ల ముందే మాంసం ముద్దలుగా కనిపించడంతో ఆ తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. ‘ఈ కడుపు కోత ను భరించలేం.. మీతోపాటే మేమూ వచ్చేస్తాం’ అంటూ కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ దృశ్యాలను చూసిన వారి గుండెలు ద్రవిం చాయి. విద్యుత్‌ శాఖ నిర్లక్ష్యం వల్లే  రెండు నిండు ప్రాణాలు బలయ్యాయని స్థానికుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. వివరాలివి..

జంగారెడ్డిగూడెం, జూన్‌ 24 : దేవులపల్లికి చెందిన వల్లేపల్లి దుర్గారావు, రాధకు నాగేంద్ర(21), ఫణీంద్ర(19) ఇద్దరు కుమారులు. నాగేంద్ర ఏలూరు ఇంజనీరింగ్‌ కళా శాలలో బీటెక్‌ నాలుగో సంవత్సరం చదువుతుండగా, ఫణీం ద్ర జంగారెడ్డిగూడెంలోని ఓ ప్రైవేట్‌ కళాశాలలో ఇంటర్మీ డియట్‌ పూర్తిచేశాడు. ఉన్నత చదువులకు సిద్ధమవుతు న్నారు. నాలుగు రోజులుగా తండ్రి దుర్గారావుకు నీరసంగా ఉండడంతో అన్నదమ్ములు ఇద్దరూ పొలంలోని గేదెలకు మేత వేసి, పాలను తీసుకు వస్తున్నారు. శుక్రవారం తెల్లవా రు జామున ఇంటి నుంచి బైక్‌పై పొలం వెళుతుండగా రోడ్డుపై తెగి వేలాడున్న 11 కేవీ విద్యుత్‌ వైరు.. కనిపించక పోవడంతో నేరుగా వైరు వీరిని తాకింది. వెంటనే ఇద్దరూ షాక్‌ గురై అక్కడికక్కడే చనిపోయారు. శరీర భాగాలు మాడి మాంసపు ముద్దలుగా మిగిలాయి. స్థానిక రైతులు విద్యుత్‌ అధికారులకు సమాచారం ఇచ్చి సరఫరాను నిలు పుదల చేశారు. దగ్ధమవుతున్న మోటారు సైకిల్‌పై అన్న దమ్ముల మృతదేహాలు భయానకంగా ఉన్నాయి. తమ కుమారులు మృతి చెందారనే విషయం తెలియగానే  తల్లి దండ్రులు కూలపడిపోయారు. గుండెలు బాదుకుంటూ ఇక మాకెందుకీ జీవితం.. మేము వెళ్లిపోతామంటూ బోరున విల పించారు. తల్లి రాధ రోదిస్తుంటే ఆమెను ఓదార్చడం ఎవరికీ సాధ్యం కాలేదు. ఏడ్చి ఏడ్చి పలుమార్లు ఆమె స్పృహ కోల్పో యింది. వీరిని చూసిన వారి కళ్లు చెమర్చాయి. అన్నదమ్ము ల మృతి వార్త తెలుసుకున్న దేవులపల్లితోపాటు  చుట్టు పక్కల పుట్లగట్లగూడెం, గుర్వాయిగూడెం, చక్రదేవరపల్లి, లక్కవరం, రావికంపాడు గ్రామాల ప్రజలు భారీగా రావడంతో ఆ ప్రాంతం జనసంద్రంగా మారింది. అన్నదమ్ముల ను చూసి ప్రతీ ఒక్కరూ కన్నీరు పెట్టుకున్నారు.

గ్రామస్తుల ఆగ్రహం..  

గతంలో ఇదే ప్రాంతంలో విద్యుత్‌ వైర్లు కింద పడి పశువులను తాకడంతో షాక్‌కు గురై మృతి చెందిన ఘటనలు అనేకం ఉన్నాయని గ్రామస్థులు చెబుతున్నారు. దీనిపై పలుమార్లు విద్యుత్‌ అధి కారులు చెప్పినా పట్టించుకోకపోవడంతో ఈ రోజు రెండు నిండు ప్రాణాలు గాలిలో కలిశాయని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. వీరి మృతికి ఆ శాఖ అధికారులే బాధ్యత తీసుకుని కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రిలో పోస్టుమార్టం పూర్తి చేసుకుని మృతదేహాలతో వస్తున్న అంబులెన్స్‌ను బంధు వులు, గ్రామస్థులు అడ్డగించారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. ట్రాఫిక్‌ జామ్‌ అవడంతో లక్కవరం ఎస్‌ఐ ఘటనా స్థలానికి వచ్చి ఆందో ళనకారులతో మాట్లాడి అంబులెన్స్‌ను పంపించి వేశారు.

బాధితులకు న్యాయం చేయాలి : టీడీపీ

అన్నదమ్ముల మృతి విషయాన్ని తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే ఘంటా మురళి, టీడీపీ మండలాధ్యక్షులు సాయిల సత్యనారాయణ, టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుల కుటుంబానికి రూ.25 లక్షలు ఇచ్చి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. 




Updated Date - 2022-06-25T06:08:46+05:30 IST