Abn logo
Jul 4 2020 @ 08:41AM

కరోనాకు మందులిస్తామని చెప్పి..బాలికను తీసుకువెళ్లిన బాలురు ఏం చేశారంటే...

Kaakateeya

రాయపూర్ (చత్తీస్‌ఘడ్): కరోనా వైరస్‌ను నయం చేసే మందులను ఆసుపత్రి నుంచి ఇప్పిస్తామని చెప్పి బాలికను తీసుకువెళ్లిన ఇద్దరు బాలురు...ఆమెపై సామూహిక అత్యాచారం జరిపిన దారుణ ఘటన చత్తీస్‌ఘడ్ రాష్ట్రంలోని ఓ గ్రామంలో జరిగింది. ఓ గ్రామానికి చెందిన మైనర్ బాలికకు కొవిడ్-19 పాజిటివ్ అని చెప్పి, ఈ వైరస్‌ను నయం చేయడానికి తాము సమీపంలోని ఆసుపత్రి నుంచి మందులు ఇప్పిస్తామని నమ్మించిన ఇద్దరు బాలురు ఆమెను ఇంటి నుంచి బయటకు తీసుకువెళ్లి అత్యాచారం జరిపారని ఏఎస్పీ ప్రతిభాపాండే చెప్పారు. తమ గ్రామానికి చెందిన ఇద్దరు బాలురు తన అక్కను కరోనా నివారణకు మందులు ఇప్పిస్తామని చెప్పి నమ్మించి తీసుకువెళ్లారని బాలిక తమ్ముడు తల్లిదండ్రులకు చెప్పాడు. తనను బయటకు తీసుకువెళ్లిన ఇద్దరు బాలురు తనపై అత్యాచారం చేశారని బాలిక తల్లిదండ్రులకు చెప్పిందని, దీంతో వారు ఫిర్యాదు చేశారని ఏఎస్పీ పేర్కొన్నారు. బాధిత బాలిక తల్లి ఫిర్యాదు మేర తాము పోస్కో చట్టం ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఏఎస్పీ చెప్పారు. నిందితుల్లో ఓ బాలుడ్ని అరెస్టు చేశామని, మరో నిందితుడి కోసం గాలిస్తున్నామని ఏఎస్పీ ప్రతిభా పాండే వివరించారు. 

Advertisement
Advertisement
Advertisement