Abn logo
Jun 23 2021 @ 00:31AM

నీటికుంటలో పడి ఇద్దరు బాలుర మృతి

బీబీపేట, జూన్‌ 22: మండలంలోని జనగామ గ్రామానికి చెందిన రామస్వామి కుమారులు కార్తిక్‌(15), సంతో్‌ష్‌(14) ప్రమాదవశాత్తు నీటికుంటలో పడి మంగళవారం మృతిచెందారు. గ్రామస్థులు, కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకా రం.. యాడారం గ్రామంలో బంధువుల మరణానికి వెళ్లి వచ్చి బూరకుంటలో స్నానం చేస్తుండగా కాళ్లు జారి లోతైన గుంతలోకి వెళ్లారు. ఈత రాకపోవడంతో నీటమునిగి చనిపోయినట్లు తెలిపారు. కళ్లముందే కన్నకొడుకులు నీటమునగడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. తండ్రి రామస్వామి ఫీర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు ఎస్సై మహేందర్‌ తెలిపారు.