హైదరాబాద్, మే 14 (ఆంధ్రజ్యోతి): పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు జనరల్ సైన్స్ పరీక్షలో రెండు బిట్ పేపర్లు రాయాల్సి ఉంటుందని పాఠశాల విద్యా శాఖ ఉన్నతాధికారులు ప్రకటించారు. ఉదయం 9.30 నుంచి 11.05 నిమిషాల వరకు ఫిజికల్ సైన్స్ పరీక్ష జరుగుతుందని, ఇందుకు సంబంధించి 10.35కు ఫిజికల్ సైన్స్ బిట్ పేపర్ ఇస్తామని వెల్లడించారు. 11.10కు బయలాజికల్ సైన్స్ పరీక్ష మొదలవుతుందని, 12.15 గంటలకు ఆ బిట్ పేపర్ అందిస్తామని తెలిపారు. ఒక్కో బిట్ పేపర్ రాసేందుకు 30 నిమిషాల సమయం ఇస్తామని అధికారులు పేర్కొన్నారు.