ఇద్దరు బైక్‌ దొంగలు అరెస్టు

ABN , First Publish Date - 2021-05-18T05:18:37+05:30 IST

డూప్లికేట్‌ తాళాలతో మోటారుసైకిళ్ల చోరీకి పాల్పడిన ఇద్దరు బైక్‌ దొంగలను టుటౌన్‌ సీఐ నరసింహారెడ్డి నేతృత్వంలో ఎస్‌ఐ నారాయణయాదవ్‌ సిబ్బందితో కలిసి సోమవారం అరెస్టు చేశారు.

ఇద్దరు బైక్‌ దొంగలు అరెస్టు
బైక్‌ దొంగల అరెస్టు వివరాలను వెల్లడిస్తున్న డీఎస్పీ ప్రసాదరావు

ప్రొద్దుటూరు క్రైం, మే 17 : డూప్లికేట్‌ తాళాలతో మోటారుసైకిళ్ల చోరీకి పాల్పడిన ఇద్దరు బైక్‌ దొంగలను టుటౌన్‌ సీఐ నరసింహారెడ్డి నేతృత్వంలో ఎస్‌ఐ నారాయణయాదవ్‌ సిబ్బందితో కలిసి సోమవారం అరెస్టు చేశారు. వారి నుంచి రూ.4లక్షల 63వేలు విలువ చేసే మోటారుసైకిళ్లను రికవరీ చేశారు. సోమవారం సాయంత్రం స్థానిక టుటౌన్‌ పోలీ్‌సస్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో డీఎస్పీ ప్రసాదరావు వివరాలను వెల్లడించారు. సీఐ నరసింహారెడ్డికి వచ్చిన సమాచారంతో ఎస్‌ఐ నారాయణయాదవ్‌ సిబ్బందితో కలిసి మధ్యాహ్నం ఎర్రగుంట్ల మైదుకూరు బైపా్‌సలోని మోడంపల్లి క్రాస్‌ విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ ఎదురుగా వాహనాల తనిఖీ  చేపట్టారు. పోలీసులను చూసి ఇద్దరు వ్యక్తులు పారిపోయే ప్రయత్నం చేయగా అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా డూప్లికేట్‌ తాళాలతో కొర్రపాడురోడ్డులోని ఆంజినేయస్వామి దేవాలయం వద్ద ఒక  బైక్‌,  వైఎంఆర్‌ కాలనీలో మరో బైక్‌తో పాటు మైదుకూరులో రెండు బైక్‌లు చోరీ చేసినట్లు తెలిపారని డీఎస్పీ చెప్పారు. పట్టుబడిన వారిలో మైదుకూరుటౌన్‌ వైవీఆర్‌ కాలనీకి చెందిన షేక్‌ కరీముల్లా, విజయరామరాజుకాలనీకి చెందిన చెంగారి సునీల్‌లు ఉన్నారన్నారు. వీరు చోరీ చేసిన డ్యూక్‌ మోటారుసైకిల్‌, రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బైక్‌,  రెండు బజాజ్‌ పల్సర్‌ బైక్‌లను రికవరీ చేశామన్నారు. వీటి విలువ రూ.4లక్షల 63వేలుగా డీఎస్పీ తెలిపారు. దొంగలను పట్టుకోవడంలో ప్రతిభ చూపిన సీఐ, ఎస్‌ఐ, సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. ఇద్దరు దొంగలను రిమాండుకు తరలిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో సీఐ నరసింహారెడ్డి, ఎస్‌ఐ నారాయణయాదవ్‌, సిబ్బంది పాల్గొన్నారు.


Updated Date - 2021-05-18T05:18:37+05:30 IST