ఇద్దరు బాక్సింగ్‌ కోచ్‌లకు కొవిడ్‌

ABN , First Publish Date - 2021-04-13T09:19:41+05:30 IST

మహిళా బాక్సర్ల జాతీయ శిబిరంలో ఇద్దరు సహాయ కోచ్‌లకు కరోనా సోకింది. స్వల్ప లక్షణాలతో బాధపడుతున్న ఆ ఇద్దరు మహిళా కోచ్‌లను క్వారంటైన్‌ చేశారు...

ఇద్దరు బాక్సింగ్‌ కోచ్‌లకు కొవిడ్‌

న్యూఢిల్లీ: మహిళా బాక్సర్ల జాతీయ శిబిరంలో ఇద్దరు సహాయ కోచ్‌లకు కరోనా సోకింది. స్వల్ప లక్షణాలతో బాధపడుతున్న ఆ ఇద్దరు మహిళా కోచ్‌లను క్వారంటైన్‌ చేశారు. శిబిరం యథాప్రకారం కొనసాగుతుందని బాక్సింగ్‌ సమాఖ్య వర్గాలు సోమవారం వెల్లడించాయి. శిబిరంలోని బాక్సర్లకు కొవిడ్‌ పరీక్షలు నిర్వహించారు. వాటి ఫలితాలు రావాల్సి ఉంది. 


Updated Date - 2021-04-13T09:19:41+05:30 IST