సిద్దిపేట: తల్లీ కూతుళ్లను హత్య చేసిన ఘటనలో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. హుస్నాబాద్‌లో ఈనెల 16న తల్లీ కూతుళ్లు దారుణ హత్యకు గురయ్యారు. ఈ హత్య చేయడంలో నిందితుడికి సహకరించిన ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని మీడియా ఎదుట ఏఎస్పీ మహేందర్ ప్రవేశపెట్టారు. వారి వద్ద నుంచి రెండు ద్విచక్ర వాహనాలు, గొడ్డలి, 2 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని ఏఎస్పీ తెలిపారు. వారిని కోర్టులో హాజరు పరచనున్నట్లు ఏఎస్పీ మహేందర్ వెల్లడించారు.