రెండూ ముఖ్యమే!

ABN , First Publish Date - 2020-02-25T11:12:58+05:30 IST

పరీక్షల సమయంలో పిల్లలకు చదవడంతోపాటు రాయడం కూడా నేర్పాలి. పరీక్షలనేవి ప్రధానంగా రాయడానికి సంబంధించినవి కాబట్టి, పిల్లలకు అందులోని మెలకువల గురించి చెప్పడం చాలా అవసరం. పిల్లలకు చెప్పాల్సిన మెలకువల్లో ప్రధానమైనవి ఏమిటంటే...

ఏదో ఒక ఆన్సర్‌ తీసుకుని మూడు నాలుగు సార్లు చూసి రాయాలి. అలా రాశాక ఒకసారి చూడకుండా రాయడం ప్రాక్టీస్‌ చేయాలి. 

చూసి రాసినా, చూడకుండా రాసినా మొదటిసారి అంత వేగం ఉండదు. ఏదైనా ఒకటికి రెండు సార్లు రాస్తుంటేనే...రాసే వేగం పెరుగుతుంది. 

చూడకుండా రాసేటప్పుడు ఎవరికైనా పెద్దగా వేగం ఉండడం లేదూ అంటే, ఆ విషయం లోతుగా, పూర్తిగా అర్థం కాలేదని అర్థం. ఆ స్థితిలో రాయడం ఆపేసి మళ్లీ చదవాలి. 

రాస్తూ కూర్చోవడం వల్ల సమయం వృఽథా కాదా? అని పిల్లలు ప్రశ్నించవచ్చు. అయితే, ఒకసారి రాయడం అనేది పదిసార్లు చదవడానికి సమానమని వాళ్లకు అర్థమయ్యేలా చెప్పాలి.

Updated Date - 2020-02-25T11:12:58+05:30 IST